Salute to Mother : ఎన్నికల హామీలు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం( Alliance government ) కసరత్తు ప్రారంభించింది. ఈ నెలలోనే కీలకమైన రెండు పథకాలను అమలు చేయనుంది. ముందుగా అన్నదాత సుఖీభవ తొలి విడత నిధుల విడుదలకు సమయత్వం అవుతోంది. ఈ మేరకు మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభం లోగా తల్లికి వందనం అమలుపైన నిర్ణయం తీసుకుంది. తాజాగా సీఎం చంద్రబాబు ఈ పథకం అమలుపై స్పష్టతనిచ్చారు. ఒకే విడతలో అమలు చేస్తారా? లేకుంటే రెండు విడతల్లో చెల్లిస్తారా? అనేది చర్చగా మారింది. ఈ పథకం అమలుకు సంబంధించి నిబంధనలు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం కోసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
* అంతమంది పిల్లలకు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పేరిట పథకాన్ని అమలు చేసేవారు. 15వేల రూపాయల సాయం చేసేవారు. అయితే పాఠశాల అభివృద్ధి నిధులు అంటూ 2000 రూపాయల వరకు కోత విధించారు. ఆపై ఇంటికి ఒక పిల్లాడికి మాత్రమే సాయం చేసేవారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 రూపాయల చొప్పున సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు నిర్ణయించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. అయితే ఇప్పటికే బడ్జెట్లో కేటాయించిన నిధులు ఉన్న పిల్లలకు సరిపోవని విపక్షం ఆరోపిస్తోంది.
Also Read : ఏపీ ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.. ప్రతి ఒక్కరికి రూ.2 లక్షలు…
* పాఠశాలలు తెరవక ముందే సాయం..
కొత్త విద్యా సంవత్సరం( academic year) జూన్ 12న ప్రారంభం కానుంది. అంతకంటే ముందే తల్లికి వందనం కింద సాయం జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల సమయంలో తల్లికి వందనం పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పథకం అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం లోగా అందిస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే రెండు విడతల్లోనా.. ఒకే విడత లోన అన్నది తెలియాల్సి ఉంది. అయితే నిధుల సర్దుబాటు దృష్ట్యా.. విద్యా సంవత్సరంలో రెండు సార్లు రూ.7500 చొప్పున అందించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. లబ్ధిదారులపై యంత్రాంగానికి ఒక అంచనా ఉంది.
* టెలికాన్ఫరెన్స్ లో స్పష్టత
తాజాగా సీఎం చంద్రబాబు( CM Chandrababu) కూటమినేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికి వందనం అమలు చేస్తామని స్పష్టత ఇచ్చారు. వార్షిక బడ్జెట్లో రూ.9407 కోట్లు కేటాయింపులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రాథమికంగా 69.16 లక్షల మంది తల్లికి వందనం పథకానికి అర్హులుగా విద్యాశాఖ లెక్క తేల్చినట్లు సమాచారం. అయితే ఈ పథకం అర్హతకు సంబంధించి 75% హాజరు తప్పనిసరి. ఆదాయ పన్ను చెల్లింపు దారులు, తెల్ల రేషన్ కార్డు లేని వారికి, కారు ఉన్నవారికి, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి ఈ పథకం అందదు. అయితే అధికారికంగా ఈ కొత్త నిబంధనలు ఖరారు చేయాల్సి ఉంది.
Also Read : రూ.లక్ష కోట్లతో అమరావతి 2.0.. పక్కా ప్రణాళిక!