Homeఆంధ్రప్రదేశ్‌Sajjala Ramakrishna Reddy authority cut: సజ్జల అధికారాలకు కోత.. ఆ ఒక్క బాధ్యత తప్ప!

Sajjala Ramakrishna Reddy authority cut: సజ్జల అధికారాలకు కోత.. ఆ ఒక్క బాధ్యత తప్ప!

Sajjala Ramakrishna Reddy authority cut: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీలో సజ్జల హవా తగ్గుతోందన్న కామెంట్స్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో పార్టీకి కర్త,కర్మ,క్రియగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండేవారు. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మొత్తం వ్యవహారాలు నడిపేది సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానంలో ఆయన ఉండేవారు. పార్టీ నియామకాల తో పాటు రాజకీయ వ్యూహాలు సైతం సజ్జల చూస్తుండేవారు. కానీ ఎందుకో ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దగా కనిపించడం లేదు. పార్టీలో వివిధ విభాగాలకు సంబంధించిన ఆదేశాలు వేరే నేతల నుంచి వస్తున్నాయి. సజ్జల పాత్ర తగ్గడంతో ఆయనను ఇప్పుడు నేతలు లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో తాడేపల్లికి సీనియర్లు రాబోతున్నారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కకు తప్పిస్తున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నియోజకవర్గ పరిశీలకుల వరకు..
రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కోఆర్డినేషన్ చేసుకునే బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డికి(Sajjala Ramakrishna Reddy ) అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. కొత్త ఇన్చార్జిల నియామకం, రాజకీయ వ్యూహాలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు ఇలా అన్నింటినీ ప్లాన్ చేసి బాధ్యతలు తీసుకునేవారు సజ్జల. ఆయన నుంచి ఆదేశాలు వచ్చాయి అంటే తప్పకుండా పాటించాల్సిందే. కానీ ఇటీవల ఒక్క నియోజకవర్గాల పరిశీలకుల పర్యవేక్షణకు మాత్రమే సజ్జల రామకృష్ణారెడ్డి పరిమితం అవుతున్నారు. మిగతా బాధ్యతల నుంచి ఆయనను తప్పించినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగానే తప్పించారా? లేకుంటే ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read: దివ్యాంగులకు గుడ్ న్యూస్… ఆ ఐదు బస్సుల్లో ఫ్రీ!

తెరపైకి కొత్త నేతలు..
తాడేపల్లి కార్యాలయ( Tadepalli ) నిర్వహణలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారికి పార్టీలో ప్రాధాన్యత పెరిగింది అన్న టాక్ వస్తోంది. మరోవైపు ధర్మాన లాంటి సీనియర్ నేతలు తీసుకొచ్చి పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగిస్తారు అన్న ప్రచారం కూడా ఉంది. బహుశా ఈ ప్రచారం వెలుగులోకి వచ్చిన తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి కనిపించకుండా మానేశారు. క్రమేపి ఆయన ప్రాధాన్యం తగ్గినట్లు స్పష్టం అవుతుంది. ఈ పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఏదో ఒకటి జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. పైగా బయటనేతల ఆదేశాలతో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.

సజ్జల రామకృష్ణారెడ్డిని తప్పిస్తారా? లేదా అని కొంతమంది సీనియర్లు నేరుగా అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. ఆయన తీరుతోనే మొన్నటి ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని ఎక్కువమంది ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతల మాటలను పరిగణలోకి తీసుకోకుండా సజ్జలను అదే ప్రాధాన్యంలో కొనసాగిస్తే ఇబ్బందికరమని జగన్ గుర్తించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో కనిపించకపోవడం, ఆయన ఆదేశాలు కూడా ఇవ్వకపోవడం కొత్త చర్చకు దారితీసింది. మరి ఏం జరిగిందో వారికే తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular