Vizag investment: దావోస్ లో( davos ) ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. పరిశ్రమలతో పాటు సంస్థల ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. అయితే ఈసారి ఇండియాలోని పలు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులతో పాటు కీలక మంత్రులు వెళ్లారు. దాదాపు పదికి పైగా పెవీలియన్లు ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ ఒకే చోట ఉండడం విశేషం. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల మధ్య పెట్టుబడుల కోసం ఆసక్తికర పోటీ నడుస్తోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉంది. అయితే భారీ ఆఫర్ వచ్చింది. విశాఖలో లక్ష కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్ఎంజెడ్ సంస్థ ముందుకు రావడం హాట్ టాపిక్ అవుతుంది. అయితే పొరుగున ఉన్న తమిళనాడు వాసులు ఈ అవకాశం చేజారిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించి ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.
దిగ్గజ సంస్థ ముందుకు..
ఆంధ్రప్రదేశ్ కు( Andhra Pradesh) మరో భారీ పెట్టుబడి వచ్చింది. విశాఖలో ఆర్ఎంజెడ్ సంస్థ.. కాపులుప్పాడలో ఫేజ్ 1 ఐటీ పార్కులో జిసిసి పార్కు ఏర్పాటు చేయనుంది. ఆ సంస్థ ఎండి మనోజ్ మెండాతో మంత్రి నారా లోకేష్ చర్చలు జరిపారు. రాబోయే పదేళ్లలో దాదాపు పది మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే దక్షిణాది రాష్ట్రాలకు కాదని.. ఏపీకి పెట్టుబడులు రావడం పై.. చెన్నై అప్డేట్స్ పేరుతో ఉన్న ఓ ఎక్స్ అకౌంట్ నుంచి ఆసక్తికర ట్వీట్ చేశారు.’ బెంగళూరు, హైదరాబాద్ లు చెన్నై ను వెనక్కి నెట్టినట్టేనా? కోయంబత్తూర్ ను విశాఖపట్నం వెనక్కి నెట్టేసింది. దీనికి కారణం ఆఫీసుల కోసం అవసరమైన స్థలం దొరకక పోవడమే. విశాఖపట్నం ఆర్ఎం జెడ్, సత్వా, రహేజా వంటి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలను ఆకర్షించగలిగింది. కానీ మన తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో కూడా ఈ కంపెనీలను తీసుకురాలేకపోయింది. మరో మంచి అవకాశం చేజారి పోతోంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ ఉంది. విశాఖకు ఆర్ఎం జెడ్ తరలి వెళ్లడం కోయంబత్తూర్ కు కోలుకోలేని దెబ్బ అని పరోక్షంగా ప్రస్తావించారు. కోయంబత్తూర్ లో ఆర్ఎం జెడ్ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయలేకపోయిందనేది వీరి వాదన.
గతంలో కర్ణాటక నుంచి..
గతంలో కర్ణాటక( Karnataka) నుంచి ఇటువంటి అభ్యంతరాలు వచ్చాయి. చాలామంది ఐటి నిపుణులు, కంపెనీల నిర్వహకులు ఇదే మాదిరిగా ట్వీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో తమిళనాడు రాజధాని చెన్నైకు రావాల్సిన కంపెనీలు హైదరాబాద్, బెంగళూరుకు తరలి వెళ్లాయి. ఇప్పుడు కోయంబత్తూర్ కు రావాల్సిన కంపెనీలు విశాఖకు వెళ్ళిపోతున్నాయి అనేది తమిళనాడు వాసుల ఆవేదన. కోయంబత్తూర్ కు రావాల్సిన కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయని వారు చెప్పుకొస్తున్నారు. కోయంబత్తూర్ అనేది టైర్ 2 నగరం. అదే స్థాయిలో ఉంది విశాఖపట్నం. అయినా సరే విశాఖకు పరిశ్రమలు వెళ్లిపోతుండడం వెనుక అక్కడి ప్రభుత్వం చూపుతున్న చొరవ కారణమని తమిళనాడు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ప్రభుత్వ అనుకూల విధానాలతోనే కంపెనీలు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఆసక్తికర ట్వీట్ వైరల్ అవుతోంది.
Coimbatore will lose out to Vizag just like how Chennai lost out to Bengaluru/Hyderabad just because of this office space supply. Vizag managed to pull RE Players like RMZ, Sattva, Raheja etc which our TN Govt couldn’t even expand into Chennai. Another potential going away https://t.co/Kq3PPN9MsH
— Chennai Updates (@UpdatesChennai) January 20, 2026