https://oktelugu.com/

Minister RK Roja : మంత్రిగా ఏడాది పూర్తి.. రోజా సాధించింది ఏమిటి?

తన శాఖ ప్రగతి కంటే కంట్రవర్సీ కామెంట్స్ కే ఆమె ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండడంతో ఆమె వివాదాస్పద మంత్రుల జాబితాలో చేర్చారు. తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారన్న విమర్శ ఉంది.

Written By:
  • Dharma
  • , Updated On : May 4, 2023 / 07:14 PM IST
    Follow us on

    Minister RK Roja : ఆర్కే రోజా.. తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు. తొలుత సిల్వర్ స్క్రీన్.. తరువాత పొలిటికల్ స్క్రీన్ పై మెరిసిన గ్లామరస్ లేడీ. అటు సినీ రంగంలో ఎన్నో కష్టాలు పడి నిలబడ్డారు. రాజకీయ రంగంలో సైతం ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వరుస రెండుసార్లు చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గత ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయిన విధంగా అత్తెసరు మెజార్టీతో గెలుపొందారు. కేబినెట్ లో చోటు దక్కుతుందని ఆశించారు. కానీ చుక్కెదురైంది. సొంత పార్టీలోనే అసమ్మతి ఎదుర్కొవాల్సివచ్చింది. కానీ అనూహ్యంగా మంత్రి పదవి దక్కడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీలో వ్యతిరేక నేతలపై విరుచుకుపడుతున్నారు.

    పవర్ ఎంజాయ్ తప్ప…
    మంత్రి పదవి దక్కి ఏడాదవుతోంది. అయితే తాను చేపట్టిన పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులంటూ ఏమీ లేవు. ఉన్నవాటికి కేటాయింపులులేవు. నిధులు లేవు.. విధులూ లేవు. దీంతో రోజా పవర్ ఎంజాయ్ మెంట్ కే పరిమితమవుతున్నారన్న టాక్ అయితే మాత్రం ఉంది., తరచూ విదేశీ పర్యటలనకే పరిమితమవుతున్నారన్న విమర్శ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆమె వ్యవహార శైలి ఉంది. విదేశీ ప్రయాణాలు, బుల్లితెర ఈవెంట్ల దృశ్యాలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో మంత్రి రోజాకు పనిలేదన్నటాక్ సర్వత్రా విస్తరించింది.

    మెగా కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు..
    నిత్యం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంలో రోజా ముందుంటారు. ఈ క్రమంలో మెగా బ్రదర్స్ పై ఓ సారి ఓవర్ కామెంట్స్ చేశారు. అందుకే ముగ్గురు సోదరులను ప్రజలు తిరస్కరించారంటూ ఎద్దేవా చేశారు. అందులో చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడాన్ని మెగా బ్రదర్ నాగబాబు ఎంటరయ్యారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు ఏంటో రోజా తెలుసుకోవాలన్నారు. పర్యాటక శాఖ మంత్రి అంటే మీరు పర్యటనలు చేయడం కాదు అంటూ రిప్లయ్ ఇచ్చారు. పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలని రోజాకు సూచించారు.
    టాప్ 20 ర్యాంకింగ్స్ లో దేశంలో ఏపీ పర్యాటక శాఖ 18 స్థానంలో ఉందన్న విషయం గుర్తించుకోవాలంటూ హితవుపలికారు.

    నిత్యం వివాదాస్పదమే..
    అయితే తన శాఖ ప్రగతి కంటే కంట్రవర్సీ కామెంట్స్ కే ఆమె ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండడంతో ఆమె వివాదాస్పద మంత్రుల జాబితాలో చేర్చారు. తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారన్న విమర్శ ఉంది. మొన్న ఆ మధ్య సూర్యలంక బీచ్ ను మంత్రి హోదాలో సందర్శించారు. ఆ సమయంలో ఆమె చెప్పులు మోస్తూ నాగరాజు అనే పర్యాటక శాఖ ఉద్యోగి కనిపించాడు. క్షణాల్లో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చెప్పులు మోసుకోలేనంతగా రోజా ఏం పనిచేస్తున్నారో అని నెటిజన్లు తెగ కామెంట్లు పెట్టారు. ఇంటా బయట ఇది విమర్శలకు గురిచేసింది.