Chandrababu – ABN RK : ” జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. నాటి టిడిపి నేతలను అరెస్టు చేసి.. కోర్టుకు తీసుకెళ్లాదాక ఏ కేసులు పెట్టారో పోలీసులు చెప్పేవరకు కాదట.. ఇప్పుడు మాత్రం ఎఫ్ఐఆర్ లో ఉన్న వివరాలను పోలీసులు ముందే చెప్పేస్తున్నారట. దీనివల్ల అభియోగాలు ఎదుర్కొంటున్నవారు జాగ్రత్త పడుతున్నారట” ఇలా ఎన్నో రాశాడు రాధాకృష్ణ ఇవాల్టి తన కొత్త పలుకులో.. చంద్రబాబుకు, రాధాకృష్ణకు ఈమధ్య సరిగా సయోధ్య లేనట్టుంది. ఎక్కడ విపరీతమైన అసంతృప్తి ఉన్నట్టుంది. అసహనం కూడా రాధాకృష్ణ రాతల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఐదేళ్ల కాలం ఇలాగే ఉంటే.. తర్వాత నీకు కష్ట కాలమేనని.. రాధాకృష్ణ చంద్రబాబు హెచ్చరిస్తున్నాడు.. పసుపు రంగు వేసుకుని.. చర్నాకోల్ పట్టుకొని పోతరాజు మాదిరిగా కొట్టుకునే రాధాకృష్ణ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమేనుక కారణాలు బయటికి పెద్దగా తెలియకపోయినప్పటికీ.. టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడికి దక్కినట్టుగా.. తనకు రాచ మర్యాదలు సొంతం కావడం లేదనా? ఇంకా ఏదైనా రాధాకృష్ణ బలంగా కోరుకుంటున్నాడా.. చూడబోతే రాజ్యసభ కోపం మాత్రం గట్టిగానే కనిపిస్తోంది. కానీ వాటికి రాధాకృష్ణ తను ఏం చెప్పాలనుకుంటున్నాడో.. వివరించలేకపోతున్నాడు.. స్పష్టంగా అనలేకపోతున్నాడు..
కొత్త పలుకులో రాధాకృష్ణ ఇంకా ఏం చెప్పాడంటే..
చంద్రబాబుకు ఇప్పుడు అధికారం ఉంది. పార్టీని గట్టిగా పట్టించుకోవాలి. రాజకీయ ఎజెండాను అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి.. నాడు జగన్ తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని ఎలా నిలువరించగలిగాడు.. టిడిపి నాయకులపై ఎలాంటి కేసులు పెట్టగలిగాడు.. ఎలాంటి వాటిల్లో ఇరికించగలిగాడు.. అవన్నీ చూసి నేర్చుకో చంద్రబాబు అంటూ రాధాకృష్ణ అతని రాతల్లో చెప్పేశాడు.. నువ్వు ఇలా ఉంటే నీ వల్ల కాదు.. అంతేకాదు 2029లో లోకేష్ సంగతి కూడా ఏమవుతుందో నీకు తెలుసా? అంటూ రాధాకృష్ణను హెచ్చరిస్తున్నాడు..” మీ ఎమ్మెల్యేలు ఇస్తాను సారంగా ప్రవర్తిస్తున్నారు. విమానాశ్రయాలు నిర్మిస్తే మీకు జనం ఓట్లు వేస్తారా? చివరికి విమానాశ్రయ పనులకు మేనేజర్లను కూడా ఎమ్మెల్యేల ప్రోద్బలంతో అపహరిస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఇలాంటి ఎమ్మెల్యేల వల్లే మీ పార్టీ నాశనం అవుతోందని” రాధాకృష్ణ చంద్రబాబును హెచ్చరించాడు. నాడు టిడిపి నేతలపై జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించాడు. చుక్కలు చూపించాడు. అందువల్లే వారు తెగించి పోరాడారు. పోట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పని చేస్తే వైసిపి మరింత బలోపేతం అవుతుంది కదా.. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు కదా.. ఈ మాత్రం లాజిక్ ను రాధాకృష్ణ ఎలా మర్చిపోయాడు.. లోకేష్ విషయంలో చంద్రబాబుకు ఓ క్లారిటీ ఉంది. అతని కొడుకు రాజకీయ భవిష్యత్తు గురించి ఆయనకు ఆ మాత్రం తెలియదా.. వైసీపీని తొక్కితే లోకేష్ ఎలా పైకి లేస్తాడు? జనామోదం లేకుండా లోకేష్ నాయకుడు ఎలా కాగలడు? ఇప్పటికీ పార్టీ పై, తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖ పై లోకేష్ పట్టు సాధిస్తున్నాడు. ఆయన పనిని చంద్రబాబు చేసుకొని ఇస్తున్నాడు. మధ్యలో రాధాకృష్ణకు ఎందుకు ఇన్ని సందేహాలు వస్తున్నాయో అర్థం కావడం లేదు.. మొత్తంగా చూస్తే చంద్రబాబు, రాధాకృష్ణకు ఎక్కడ తేడా కొట్టింది. అందువల్లే ఈ రాతలు.. కొత్త పలుకులు ఆగ్రహావేశాలు.. చంద్రబాబు సార్.. రాజ్యసభ పదవి రాధాకృష్ణకి ఇవ్వండి.. అప్పుడు మీలో ఉన్న నెగెటివిటీ మొత్తం పోయి పాజిటివిటీ వస్తుంది.. కాంగ్రెస్ పార్టీ గిరిశ్ సంఘీ కి ఇచ్చినట్టుగానే.. మీరు కూడా రాధాకృష్ణకు ఇస్తే ఓ పనైపోతుంది.