Renu Desai : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఎప్పటి నుండో యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ ని వేదికగా చేసుకొని ఆమె మూగ జీవాల గురించి, పర్యావరణం గురించి అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇకపోతే రీసెంట్ గా HCU భూముల వ్యవహారం లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై తీవ్రమైన వ్యతిరేక జ్వాలలు తగులుతున్నాయి.గచ్చిబౌలి లోని 400 ఎకరాలను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం అక్కడి భూములను తయారు చేసేందుకు అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసేందుకు అర్థరాత్రి JCB లను పంపించింది. JCB లు రావడంతో అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులు బయటకు పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో లీకై బాగా వైరల్ అయ్యింది.
Also Read : 2 నిమిషాల్లో హౌస్ ఫుల్..రీ రిలీజ్ లో ‘ఆర్య 2’ సెన్సేషనల్ రికార్డు!
ఎన్నో వందల చెట్లు నేలమట్టం కానున్నాయి. ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలను తప్పుబడుతూ ప్రతిపక్ష పార్టీలు తమ గళాలను వినిపించాయి. ఈ నేపథ్యం లో రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘మనుషులు తమ స్వార్థం కోసం చెట్లను, మూగ జీవాలను చంపేస్తున్నారు. దీనిని మనం ఎప్పటికీ అడ్డుకోలేమా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా జనతా గ్యారేజ్ లోని ఎన్టీఆర్ డైలాగ్స్ ని షేర్ చేసింది. జనతా గ్యారేజ్ సినిమా లో లాగానే బయట కూడా అలాంటి రియల్ హీరో ఉంటే బాగుండేది అనే అర్థం వచ్చేలా ఆ వీడియో ఉన్నది. అంతే కాకుండా తన మిరులతో చేసిన ఒక వాట్సాప్ చాట్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. లాయర్లు అందరూ కలిసి పిటీషన్లు వేస్తే ఈ దుర్మార్గపు చర్యని అడ్డుకోగలం అని, హై కోర్ట్ లో దీనిపై తీవ్రమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది.
అభివృద్ధి పేరుతో పర్యావరణం ని పూర్తిగా నాశనం చేస్తున్నారంటూ ఆమె ఆరోపణలు చేసింది. రోజురోజుకి ఈ అంశంపై నెగటివిటీ సోషల్ మీడియా లో బాగా పెరిగిపోతుంది. కచ్చితంగా ఇది ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత తెచ్చిపెట్టే అంశమే. ఈ అంశం జనాల్లో కూడా చైతన్య రగిలించగలిగితే, కచ్చితంగా ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడైనా రేవంత్ సర్కార్ ఒక అడుగు వెనక్కి వేస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ వివాదం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్తే కచ్చితంగా న్యాయం జరుగుతుందని, ఇలాంటి ఘటనలను సుప్రీం కోర్టు ఏ మాత్రం సహించదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ మార్పులు చేర్పులు ఉండవని అందరు అంటుంటారు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
Also Read : ఎత్తుకొని.. లాలించి.. బుజ్జగించి.. కొత్త వ్యక్తిని పరిచయం చేసిన నితీష్ కుమార్ రెడ్డి!