Andhra Pradesh Power Tariff: ఏపీ( Andhra Pradesh) ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. నవంబర్ నుంచి విద్యుత్ చార్జీలు తగ్గించనున్నట్లు సంబంధిత మంత్రి తెలిపారు. యూనిట్ పై 13 పైసలు తగ్గుతుందని ప్రకటించారు. గత ప్రభుత్వం ట్రూ ఆప్ చార్జీల పేరిట వసూలు చేస్తే.. తమ ప్రభుత్వం ట్రూ డౌన్ పేరిట చార్జీలను తగ్గిస్తోందని కూటమి నేతలు చెబుతున్నారు. గతంలో ట్రూ ఆఫ్ ఉండగా.. ఇప్పుడు ట్రూ డౌన్ విధానంతో రూ.1000 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఈ ట్రూ ఆఫ్ చార్జీల తగ్గింపుకు సంబంధించి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు విద్యుత్ శాఖ ఉత్తర్వులు దాడి చేసింది
తొలిసారిగా తప్పిన ప్రకటన..
విద్యుత్ శాఖకు( electricity department) సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వస్తే.. బాదుడు అనే పదం వినిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం ప్రజలపై భారం తగ్గిస్తూ విద్యుత్ శాఖ కీలక ప్రకటన చేసింది. విద్యుత్ వినియోగదారులపై ట్రూ ఆప్ భారాన్ని తగ్గించింది. ఈ ఒక్క ప్రకటనతో ఏపీ వినియోగదారులకు 923.55 కోట్లు ఆదా కానుంది.
ప్రతిపాదనలకు విరుద్ధంగా..
ప్రతి ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు రకరకాల పేరిట ప్రతిపాదనలు చేస్తుంటాయి. అందులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను డిస్కం లు దాఖలు చేసిన రూ. 2,758.76 కోట్లను ట్రూ ఆప్ కింద పేర్కొన్నాయి. కానీ ఏపీ ఈ ఆర్ సి రూ. 1863.64 కోట్లకు ఆమోదం తెలిపింది. కానీ డిస్కం లు వినియోగదారుల నుంచి రూ. 2787 కోట్లు వసూలు చేశాయి. ఈ మొత్తం నుంచి రూ.1863.64 కోట్లను మినహాయించి మిగిలిన రూ.923.55 కోట్లను విద్యుత్ వినియోగదారులకు తిరిగి చెల్లించాలని ఏపీ ఈ ఆర్ సి ఆదేశించింది. దీంతో వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది.
అలా సర్దుబాటు..
ఇప్పటివరకు సర్దుబాటు చార్జీలను ట్రూ ఆప్ గా చూపేవారు. ఇకనుంచి ట్రూ డౌన్ చార్జీలుగా చూపనున్నారు. ఈ రూ.923.55 కోట్లను ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు. దీంతో యూనిట్ కు 13 పైసలు చొప్పున వినియోగదారులకు లబ్ధి చేకూరుతుంది. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు వాడిన విద్యుత్ యూనిట్లను అనుసరించి.. ఈ బిల్లు లెక్కించనున్నారు. అలా యూనిట్ పై 13 పైసలు లెక్క కట్టి.. ప్రస్తుతం వచ్చే బిల్లుల్లో సత్తుబాటు చేస్తారు.
తొలిసారిగా ట్రూ డౌన్..
సాధారణంగా ట్రూ ఆఫ్ చార్జీలు పెంపునకు వర్తిస్తాయి. ట్రూ టౌన్ అంటే తగ్గింపు కిందకు వస్తుంది. దీని ప్రకారం వాస్తవంగా డిస్కములకు అనుమతించిన దానికన్నా తక్కువ ఖర్చు అయితే.. డిస్కం ల దగ్గర నుంచి ఆ మిగిలిన మొత్తాన్ని వసూలు చేసి.. దానిని వినియోగదారులకు సర్దుబాటు చేయాలని ఏపీఈఆర్సి ఆదేశిస్తుంది. దీనినే ట్రూ డౌన్ అంటారు. తొలిసారిగా ఏపీలో ట్రూ డౌన్ చార్జీలు అమలు చేయడం విశేషం.