Ganesh Immersion Recording Dance: సాధారణంగా వినాయక నవరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. వేడుకగా నిర్వహిస్తుంటారు. సందడి నడుమ స్వామి వారి నిమజ్జనం కార్యక్రమాన్ని జరిపిస్తుంటారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ వేడుకలు జరుగుతుండడం, అనేక రకాల విషాదాలకు దారితీస్తుండడంతో ఈ ఏడాది ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. వినాయక మండపాలకు అనుమతులను తప్పనిసరిచేసింది. నిబంధనలు సైతం విధించింది. మండపాల వద్ద అశ్లీల నృత్యాలు, నిషేధిత వస్తువులు తాగడం, తినడం వంటివి నిషిద్ధం. ఆపై జూదం ఆటలు సైతం ఉండకూడదని నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయితే చాలాచోట్ల కనీస నిబంధనలు పాటించలేదన్న విమర్శ ఉంది. ముఖ్యంగా రాజకీయ జోక్యంతో ఎక్కువమంది నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది.
* హిజ్రాలతో నృత్యాలు..
పశ్చిమగోదావరి జిల్లాలో అయితే ఏకంగా అశ్లీల నృత్యాలతోనే.. స్వామివారి నిమజ్జనాన్ని జరిపించారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత నెల 31న ఈ నిమజ్జన కార్యక్రమం జరిగింది. కానీ అందుకు సంబంధించిన వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచెర్లలో గత నెల 31న నిమజ్జన ఊరేగింపు జరిగింది. ట్రాక్టర్ ఏర్పాటు చేసి హిజ్రాలతో డ్యాన్సులు వేయించారు. యువకులు అసభ్యకరంగా అనుసరిస్తూ ఈ ఊరేగింపు చేపట్టారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు రావడంపై అనేక రకాల విమర్శలు వచ్చాయి. ఇదే నా సనాతన ధర్మం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రారంభించింది. దీంతో ఇదో హాట్ టాపిక్ గా మారింది.
* అన్నిచోట్ల ఇదే పరిస్థితి..
అయితే ఒక్క తెలికిచెర్లలో కాదు.. చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంది. రాజకీయంగా పలుకుబడి ఉన్న గ్రామాల్లో.. వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా నిబంధనలు పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అశ్లీల నృత్యాలతో ప్రజలను ఇబ్బంది కలిగించిన పూజా కమిటీ సభ్యులుపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే నిమజ్జనోత్సవం లో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్న అపశృతులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డీజేల హోరు ఎక్కువగా ఉంది. ఈరోజు సైతం నిమజ్జనోత్సవాల జరిగే అవకాశముంది. అందుకే పోలీస్ అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
SANATHANA DHARMA IN FULL DISPLAY
Vulgar and disgusting “recording dance” performances organised as part of Vinayaka Nimarjanam in Andhra Pradesh
The incident is being reported from Telikicherla village in Nallajerla mandal of East Godavari district.
No Hindu sentiments were… pic.twitter.com/6FO2u9S1w7
— Revathi (@revathitweets) September 4, 2025