https://oktelugu.com/

Rayalaseema YCP: రాయలసీమలో వైసీపీకి ఎదురుగాలి.. ఆ కారణాలతోనే!

వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సీన్ మారుతోంది. దశాబ్దాల రాజకీయ చరిత్ర తీసుకుంటే రాయలసీమ వాసులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.

Written By:
  • Dharma
  • , Updated On : April 6, 2024 / 12:43 PM IST

    Rayalaseema YCP

    Follow us on

    Rayalaseema YCP: రాయలసీమలో సీన్ మారుతోంది. విపక్షాలు పట్టు బిగిస్తున్నాయి. అధికార పార్టీకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గతం మాదిరిగా అంత ఈజీ కాదని తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో రాయలసీమలో వైసిపి మంచి ఫలితాలు సాధించింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పర్వాలేదనుకున్న ఫలితాలు వచ్చాయి. కానీ 2019లో మాత్రం వైసీపీ ది వైట్ వాష్. 52 నియోజకవర్గాలకు గాను ఆ పార్టీ 49 చోట్ల విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలకే పరిమితం అయ్యింది. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రమే గెలుపొందారు. మిగతా 49 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పలేదు. టిడిపి ఆవిర్భావం తర్వాత రాయలసీమలో ఇన్ని తక్కువ స్థానాలు గెలుచుకోవడం అదే మొదటిసారి.

    Against YCP in Rayalaseema.. for those reasons!

    అయితే రాయలసీమలో ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. విపక్షాలు గెలుచుకున్నంత స్థితిలో లేకపోయినా.. వైసిపి పై మాత్రం వ్యతిరేకత పెరుగుతోంది. దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ప్రత్యేక ప్రాజెక్టులు నిర్మించకపోవడం, రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేయకపోవడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడకపోవడం వంటి కారణాలతో అధికార పార్టీపై వ్యతిరేకత పెరిగింది. మరోవైపు విపక్షాలన్నీ కూటమి కట్టడం కూడా వైసీపీకి మైనస్ గా మారింది.

    వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సీన్ మారుతోంది. దశాబ్దాల రాజకీయ చరిత్ర తీసుకుంటే రాయలసీమ వాసులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రాయలసీమలో కాంగ్రెస్ భావజాలం కూడా అధికం. 2014లో రాష్ట్ర విభజన, వైసీపీ ఆవిర్భావం తదితర కారణాలతో సీమవాసులు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ కావడంతో అటువైపుగా చూస్తున్నారు. ప్రత్యామ్నాయ పార్టీగా భావిస్తున్నారు. వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు కూడా పెరుగుతున్నాయి. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన వారిలో రాయలసీమ వాసులే అధికం. మరోవైపు రాయలసీమను వివేకానంద రెడ్డి హత్య కేసు కుదిపేస్తోంది. ఈ విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించడం కూడా వైసీపీ పట్ల ప్రతికూలత చూపుతోంది. రాజన్న బిడ్డకు వేస్తారా? వైయస్ వివేకానంద రెడ్డిని చంపిన వాడికి ఓటు వేస్తారా? అన్న షర్మిల పిలుపు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్తోంది.

    రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. ఇందులో కడప, కర్నూలులో వైసీపీకి ఏకపక్ష విజయం దక్కుతూ వస్తోంది. చిత్తూరులో సైతం వైసీపీకి ఎక్కువ స్థానాలు వస్తూ ఉండేవి. అనంతపురం మాత్రం తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ వస్తోంది. అయితే ఇటీవల ఓ సర్వేలో కర్నూలు తోపాటు కడపలో తెలుగుదేశం పార్టీ తన బలం పెంచుకున్నట్లు తేలింది. ఉమ్మడి కర్నూలులో 14 అసెంబ్లీ సీట్లు గాను మెజారిటీ సీట్లను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని స్పష్టమైంది. కడపలో ఒకటి,రెండు సీట్లు వచ్చే అవకాశం ఉన్న టిడిపి.. అనూహ్యంగా బలం పెంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికైతే రాయలసీమలో వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నట్టే.