Ram Gopal Varma : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లపై గతం లో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వీళ్లిద్దరికీ సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలను అప్లోడ్ చేసి, అత్యంత నీచంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తెలుగు దేశం, జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్రమైన అసహనం ని వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు అతన్ని క్షమించినా, మేము క్షమించబోమని సోషల్ మీడియా లో పోస్టులు పెట్టారు. వాళ్ళ కోపానికి తగ్గట్టుగానే రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసారు. ఒంగోలు లో ఆయనపై కేసు నమోదు అవ్వగా, 25 వ తారీఖున విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. కానీ రామ్ గోపాల్ వర్మ పోలీసుల మాటలను లెక్క చేయకుండా విచారణకు రాకుండా నిరాకరించినందుకు, అతన్ని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ కి వెళ్లారు పోలీసులు.
అక్కడ రామ్ గోపాల్ వర్మ లేడు అనే విషయాన్ని తెలుసుకొని మళ్ళీ ఒంగోలుకు వెనుతిరిగారు. వివాదాస్పదంగా మారిన ఈ అంశంపై రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో చేస్తూ ‘నేను రాష్ట్రాన్ని వదిలి పారిపోయానని, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తలదాచుకున్నానని వార్తలు నా వరకు చేరాయి. నేనెక్కడికి పారిపోలేదు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి నా ‘డెన్’ లోనే ఉన్నాను. పోలీసులు నా ఇంటికి వచ్చారని మా వాళ్ళు నాకేమి చెప్పలేదు. అసలు వాళ్ళు నా ఆఫీస్ లోకి కూడా అడుగుపెట్టలేకపోయారు. ఒకవేళ నా ఇంటికి వచ్చి ఉంటే, నా ఆఫీస్ వరకు వచ్చేవాళ్ళు కదా..19 వ తేదీ రమన్నారు, షూటింగ్ కారణంగా రాలేను, కొద్దిరోజులు సమయం కావాలి అని అడిగాను, అందుకు అధికారులు ఒప్పుకున్నారు. నా షూటింగ్ పూర్తి అవలేదు, అందుకే మరికొంత సమయం అడిగాను, ఈలోపు నా మీద వేరు వేరు ప్రాంతాల నుండి కేసులు నమోదు అయ్యాయి. చూస్తుంటే నన్ను ఏమైనా చేస్తారేమో అని అనుమానం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు రాంగోపాల్ వర్మ.
రామ్ గోపాల్ వర్మ తాను ట్విట్టర్ లో వేసిన పోస్టులన్నీ తొలగించి , పవన్ కళ్యాణ్, చంద్రబాబు నేను వాళ్లకు వ్యతితేకంగా సినిమాలు తీశానని నా మీద కేసులు వెయ్యిస్తున్నారు, దానికి సెన్సార్ బోర్డు ఆమోదం కూడా ఉంది, చట్టరీత్యా నేరం కాదు, అయినప్పటికీ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ ట్వీట్స్ వేసాడు. కానీ గతం లో రామ్ గోపాల్ వర్మ వేసిన అసభ్యకరమైన పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని ఆయన ట్వీట్ క్రింద కౌంటర్లు గా పెడుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. నువ్వెన్ని డ్రామాలు ఆడినా, నిన్ను మాత్రం వదిలేది లేదంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ప్రభుత్వం పై మండిపడుతున్నారు.