https://oktelugu.com/

Ram Gopal Varma : స్టార్ హీరో ఇంట్లో తలదాచుకున్న రామ్ గోపాల్ వర్మ..గాలిస్తున్న పోలీసులు..మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్!

పోలీసులు రామ్ గోపాల్ వర్మ ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయగా, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఆయన సన్నిహితులను విచారించగా, తమిళనాడు లో షూటింగ్ లో ఉన్నట్టు చెప్పారు. అక్కడ విచారిస్తే రామ్ గోపాల్ వర్మ లేనట్టుగా తెలిసింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 25, 2024 / 08:38 PM IST

    Ram Gopal Varma

    Follow us on

    Ram Gopal Varma : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అసభ్యంగా మార్ఫింగ్స్ చేస్తూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక దర్శకుడు, ఇలా దిగజారి అప్పట్లో ప్రవర్తించడంపై రామ్ గోపాల్ వర్మ మీద తీవ్రస్థాయిలో నెటిజెన్స్ విరుచుకుపడ్డారు. మరో రెండు దశాబ్దాల వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటాడు అని బలమైన నమ్మకం తో ఇలాంటోళ్ళు విర్రవీగిపోయి, నేడు రాజకీయాలకు దూరంగా పారిపోవడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎన్నికలలో కూటమి ప్రభుత్వం సంచలన విజయం సాధించిన వెంటనే రామ్ గోపాల్ వర్మ ఇక మీదట రాజకీయాల గురించి మాట్లాడను అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శ్రీ రెడ్డి, పోసాని కృష్ణ మురళి వంటి వారు కూడా రాజకీయాలకు దూరంగా పారిపోయారు. అయినప్పటికీ కూడా ఇరు పార్టీల కార్యకర్తలు ఒత్తిడి కారణంగా కూటమి ప్రభుత్వం వీళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.

    అందులో భాగంగా ఒంగోలు టీడీపీ అధికార ప్రతినిది రామ్ గోపాల్ వర్మ పై కేసు ఫైల్ చేయగా, రామ్ గోపాల్ వర్మ తనని అరెస్ట్ చేసి హింసించబోతున్నారని, తన అరెస్టుని ఆపాలి అంటూ హై కోర్టులో క్వాష్ పిటీషన్ వేసాడు. దీనిని హై కోర్టు కొట్టివేసింది. దీంతో 19 వ తేదీన విచారణకు రావాల్సిందిగా రాంగోపాల్ వర్మ ని పోలీసులు ఆదేశించగా, ఆయన నాలుగు రోజుల్లో హాజరు అవుతానని చెప్పాడు. గడువు ముగిసింది, నేడు ఉదయం ఆయన పోలీసుల విచారణలో పాల్గొనాలి. కానీ రాలేదు,దీంతో పోలీసులు నేరుగా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్లిపోయారు. అక్కడ ఆయన లేకపోవడంతో లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. సెర్చ్ వారెంట్ లేకపోవడంతో లోపలకు వచ్చేందుకు రామ్ గోపాల్ వర్మ సిబ్బంది అనుమతించలేదు.

    దీంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మ ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయగా, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఆయన సన్నిహితులను విచారించగా, తమిళనాడు లో షూటింగ్ లో ఉన్నట్టు చెప్పారు. అక్కడ విచారిస్తే రామ్ గోపాల్ వర్మ లేనట్టుగా తెలిసింది. ఆ తర్వాత సుదీర్ఘంగా విచారించగా, రాంగోపాల్ వర్మ కి ఇండస్ట్రీ లో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక పాపులర్ హీరో ఫామ్ హౌస్ లో ఉన్నట్టు తెలిసింది. సాయంత్రం రామ్ గోపాల్ వర్మ ఇంటి నుండి వెనక్కి వచ్చేసిన పోలీసులు, రేపు తమిళనాడు లో రెండు బృందాలుగా విడిపోయి రామ్ గోపాల్ వర్మ ని గాలించనున్నారు. మరి రామ్ గోపాల్ వర్మ దొరుకుతాడా..? , దొరికితే ఆయన విచారణలో ఏమని సమాధానం చెప్తాడు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ వర్మ ని అరెస్ట్ చేయబోతున్నారు అనే విషయంపై తన అసంతృప్తిని వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే.