Ram Talk : ఇప్పుడు మీడియా విస్తృతి పెరిగింది. సోషల్ మీడియా రోజురోజుకు సంచలనం సృష్టిస్తోంది. అనేక రకాల వేదికలు పుట్టుకు రావడంతో విశ్లేషకులకు తమ వాణి వినిపించడం సులభం అవుతున్నది. మంచి వెనుక చెడు ఉన్నట్టు.. ఈ సామాజిక మాధ్యమ వేదికలపై న్యూట్రల్ గా విశ్లేషణ చేసేవాళ్లు చాలా అరుదుగా మారిపోయారు. అయితే ఒక పార్టీకి డబ్బా కొట్టడం.. లేకుంటే వ్యక్తి పూజ చేయడం పరిపాటిగా విశ్లేషకులు మార్చుకున్నారు. స్థూలంగా చెప్పాలంటే న్యూస్ చానల్స్ లో తమ వాణి వినిపించుకుంటూ.. రాజకీయ పార్టీలకు పెయిడ్ ఆర్టిస్టులుగా మారిపోయారు . ఇలా చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ జరుగుతున్న వాస్తవం అదే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో గంగిగోవుల్లాగా కొంతమంది విశ్లేషకులు ప్రజల కోణంలో మాట్లాడుతున్నారు. జన బాహుళ్యానికి దగ్గరగా ఉంటున్నారు. అలాంటివారికి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడుతోంది. వారు మాట్లాడే మాటలను.. చేసే విశ్లేషణలను వింటున్నది. అయితే ఇలాంటి వారిలో ప్రముఖ విశ్లేషకులు రామ్ గారు ముందు వరుసలో ఉంటారు.. ప్రపంచం నుంచి స్థానిక రాజకీయాల వరకు ఈయనకు మంచి పట్టు ఉంది. విశ్రాంత బ్యాంక్ అధికారిగా అన్ని అంశాలపై ఆయనకు అవగాహన ఉంది. ఆ అవగాహనే ఆయనను శిఖర స్థానంలో నిలబెట్టింది.
జనసేన ప్రయాణం ప్రభావితం
జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అంతకుముందు ఆయన ప్రజారాజ్యంలో పనిచేశారు. కొంత గ్యాప్ తర్వాత రాజకీయాలలో సచ్చీలతను పెంపొందించడానికి ఆయన జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ అయితే ఏర్పాటు చేశారు గాని.. క్షేత్రస్థాయి నిర్మాణం అనుకున్నంత సులభంగా సాగలేదు. ఆయన పార్టీ ప్రారంభించినప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ అంతగా లేదు. ఆయనప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఆపలేదు. చంద్రబాబును విమర్శించిన ఆయన.. జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టలేదు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు పవన్ కళ్యాణ్ తను ఒకప్పుడు విమర్శించిన చంద్రబాబుతో జతకట్టారు. ఏపీ ఎన్నికల్లో కూటమిని ఏర్పాటు చేశారు. చరిత్రలో కనివిని ఎరుగని విధంగా 164 సీట్లు గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించారు. 2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో 151 అసెంబ్లీ స్థానాన్ని గెలిచిన వైసిపిని 11 స్థానాలకు పరిమితం చేశారు.. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ తన పార్టీకి దక్కిన స్థానాలలో ఘనవిజయం సాధించారు. ఇటీవలి మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బిజెపి కూటమి విజయం సాధించింది. అంతేకాదు మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన ఓ ప్రాంత ఎమ్మెల్యే.. తన గెలుపుకు పవన్ కళ్యాణ్ కారణమని బహిరంగంగా వ్యాఖ్యానించడం విశేషం. ఇవన్నీ చెప్పడానికి సులువుగానే ఉన్నప్పటికీ.. దాడి వెనుక ఎంతో కృషి ఉంది. పవన్ కళ్యాణ్ చేసిన ఆ కృషిని.. సాగించిన ఆ మదనాన్ని ఒక వర్గం మీడియా పట్టించుకోవడం లేదు. విశ్లేషకులు ప్రజలకు చెప్పడం లేదు. కానీ ఈ బాధ్యతను రామ్ గారు భుజాలకు ఎత్తుకున్నారు. విశ్లేషణ అంటే జబ్బలు చర్చుకొని.. సొల్లు పురాణం చెప్పడం కాకుండా.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచారు. ప్రజల కోణంలో మాట్లాడారు. ప్రజలు అర్థం చేసుకునే విధంగా నిజాలను చెప్పారు. అందువల్లే జనసేన నాయకులు రామ్ గారి విశ్లేషణలను తమ ట్విట్టర్ ఖాతాలలో పోస్ట్ చేస్తూ.. ఆయన క్రెడిబుల్టీని మరోసారి ప్రదర్శిస్తున్నారు. ఇవేమీ రామ్ గారు చెబితే వారు చేసినవి కావు. ఇంకెవరో ఆదేశిస్తే పోస్ట్ చేసినవి అంతకంటే కాదు.. రామ్ గారి విశ్లేషణ వచ్చి.. ఆయన మాటలను నచ్చి.. ఆయన లోతైన దృక్పథం నచ్చి పోస్ట్ చేస్తున్నారు. దీనిని రామ్ గారు తన ఘనత అని చెప్పుకోకపోయినప్పటికీ.. ఆయన కొనసాగిస్తున్న విలువలు.. పాటిస్తున్న పద్ధతులు.. వివరిస్తున్న దృక్పథాలు చెబుతూనే ఉన్నాయి.
Twitter లో పిల్ల పిత్రే గాళ్ళ కామెంట్లు, ఏడుపుగొట్టు పచ్చ వెబ్ మీడియా కోతి రాతలు ఏం పట్టించుకుంటారు. ఇక్కడ తల పండిన మేధావులు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం పై వారి విశ్లేషణ చూడండి.
Note: ఆయనకి తల మీద ఒక్క నల్ల వెంట్రుక కూడా లేదు.@PawanKalyan @JSPShatagniTeam pic.twitter.com/pNswlevjCs
— Kishan Hindu (@Kishan_Janasena) November 28, 2024