Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ).. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు. మంచి క్రియేటివిటీ తో, తనదైన శైలిలో సినిమాలు తీశారు. ఆయన నైపుణ్యాన్ని, ప్రతిభను బాలీవుడ్ సైతం గుర్తించింది. మంచి మంచి సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. కానీ వివాదాస్పద అంశాలు జోలికి వెళ్లి పబ్లిసిటీ కూడా తెచ్చుకున్నారు. ఈ క్రమంలో లేనిపోని చిక్కులు తెచ్చుకుంటున్నారు. తాజాగా రాజమండ్రిలో ఆయన పై కేసు నమోదయింది. అయితే ఈసారి హిందూ దేవుళ్ళు, ఇండియన్ ఆర్మీ వంటి అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు రాజకీయపరమైన కేసులు ఎదుర్కొన్న వర్మ.. ఇప్పుడు సున్నితమైన అంశాలకు సంబంధించిన కేసుల్లో ఇరుక్కోవడం ఆందోళన కలిగిస్తోంది.
* శివతో తెలుగు ఇండస్ట్రీస్ షేక్..
తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా శివ. అప్పటివరకు వచ్చిన సినిమా జోనర్ కు పూర్తి భిన్నంగా.. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది. అప్పటివరకు వర్మకు ఎటువంటి అనుభవం లేదు. శివ చిత్రం తెలుగు చిత్ర ప్రపంచంలో ఒక చెరగని ముద్రని వేసుకుంది. క్రమేపీ తనలో క్రియేటివిటీని పెంచుకొని ముందుకు సాగారు వర్మ. కానీ తరువాత బయోపిక్ లు, రాజకీయ నాయకుల ఇతివృత్తాలను తీసుకుని సినిమాలు చేశారు. ఈ క్రమంలోనే గత ఐదు సంవత్సరాలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఆ పార్టీకి దగ్గర ఏ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారు. వారికి వ్యతిరేకంగా సినిమాలు కూడా తీశారు.
* పబ్లిసిటీ పిచ్చితోనే..
రాంగోపాల్ వర్మ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి వెనుకడుగు వేయరు. తద్వారా తనకు విపరీతమైన పబ్లిసిటీ వస్తుందని భావిస్తారు. అయితే ఇటీవల కాలంలో ఆయనపై కేసులు అధికమవుతున్నాయి. వైసిపి హయాంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనేక కేసులకు గురయ్యారు. వాటి విచారణలకు అప్పుడప్పుడు హాజరవుతూ వచ్చారు. అయితే ఆయన విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నట్టు కూటమి ప్రభుత్వంపై సొంత పార్టీ శ్రేణులు అనుమానంతో ఉన్నాయి. అదే సమయంలో వర్మ సైతం రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదు. ఇటీవల బొంబాయిలో ఓ చె క్ బౌన్స్ కేసులో జైలు శిక్ష పడింది. అయితే ఆ కేసును రాజీ చేసుకుని బయటపడ్డారు. కానీ ఇప్పుడు పురాణా ఇతిహాసాలు, హిందూ దేవుళ్ళ పై వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా వర్మ తన బుద్ధిని మార్చుకుంటారా? లేదా? అన్నది చూడాలి.