Homeఆంధ్రప్రదేశ్‌Rachamallu Sivaprasad Reddy: నా బొచ్చు అమరావతి.. రాచమల్లు తప్పుడు కామెంట్స్

Rachamallu Sivaprasad Reddy: నా బొచ్చు అమరావతి.. రాచమల్లు తప్పుడు కామెంట్స్

Rachamallu Sivaprasad Reddy: అమరావతి పై ( Amravati capital ) ఎలా ముందుకు వెళ్లాలో తెలియదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి ఆశించినంత సానుకూలత రాలేదు. పైగా జగన్మోహన్ రెడ్డికి ట్రోల్స్ వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా దీనిపై పెద్దగా స్పందించడం లేదు. పేర్ని నాని లాంటి వారు స్పందిస్తున్నారు కానీ అమరావతిపై అదే విషం కక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తాజాగా ఆయన అమరావతిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకవైపు అమరావతి రాజధానికి ఒప్పుకునే సాహసం చేయడం లేదు వైయస్సార్ కాంగ్రెస్. ఇంకోవైపు జగన్ మావిగన్ ప్రతిపాదన పై సానుకూలత రావడం లేదు. మూడు రాజధానుల అంశం ముగిసిన అధ్యయనం అని తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసహనానికి గురవుతున్నారు. తీవ్రప్రస్టేషన్ లో చేసిన వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి.

* తీవ్ర ప్రస్టేషన్లో
తాజాగా మావిగన్( Mavigun) ప్రతిపాదన నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కడప జిల్లాకు చెందిన చెందిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. తీవ్ర అసహనానికి గురైన ఆయన నా బొచ్చు అమరావతి అంటూ దారుణంగా వ్యాఖ్యానించారు. గతంలో అమరావతిని స్మశానంతో పోల్చారు. అమరావతి మహిళలను వేశ్యలు అన్నారు. కమ్మ రాజధాని అన్నారు.. ఇలా లేనిపోనివి చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. వాటి నుంచి నష్టం జరిగింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. అయినా సరే గుణపాఠాలు నేర్చుకోలేదు. ప్రస్తుతం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

* అనవసర కామెంట్స్..
ఇటీవల రాచమల్లు శివప్రసాద్ రెడ్డి( rachamallu sivaprasad Reddy ) లేనిపోని వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. మొన్న మధ్యన రాజశేఖర్ రెడ్డి కుటుంబ వివాదాల్లో కూడా తల దూర్చారు. వైయస్ కుటుంబ ఆస్తికి సంబంధించి పిల్లలిద్దరి మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తన కుమార్తె షర్మిల పిల్లలకు కుమారుడు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారు అంటూ ఆ మధ్యన విజయమ్మ న్యాయస్థానానికి లేఖ రాశారు. దీంతో షర్మిల తో పాటు విజయమ్మపై కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. షర్మిలా లాంటి చెల్లెలు ఏ ఇంట్లో కూడా పుట్టకూడదు అంటూ రాచమల్లు వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో మాట్లాడుతుంటే వైసీపీ కుక్కలు వచ్చి మొరుగుతున్నాయి అంటూ షర్మిల ఇచ్చి పడేశారు. దానికి స్పందించిన రాచమల్లు అధినేత జగన్ శ్రేయస్సు కోరుకునే కుక్కలం అంటూ చెప్పుకున్నారు. దానిపై స్ట్రాంగ్ రియాక్ట్ అయ్యారు షర్మిల. వైసిపి నేతలను కుక్కలతో పోల్చితే కుక్కలు బాధపడుతున్నాయి అంటూ సెటైర్లు వేశారు. అనవసరంగా లేనిపోని వివాదాల్లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వేలు పెడుతున్నారని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు అమరావతి నా బొచ్చు అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా లేనిపోని వివాదాస్పద ముద్ర మూటగట్టుకుంటున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version