https://oktelugu.com/

AP Liquor QR Code Issue : క్యూఆర్ కోడ్ స్కానర్స్ కు చిక్కని జే బ్రాండ్స్

అయితే ఇప్పుడు డిజిటల్ పేతో ఆ మద్యం సీసాలేవీ స్కాన్ కావడం లేదు. దీంతో అవి దొంగ మద్యమా? అన్న సెటైర్లు పడుతున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : July 12, 2023 / 06:26 PM IST
    Follow us on

    AP Liquor QR Code Issue : ఏపీలో మద్యం పాలసీ గురించి ఎంత తక్కువుగా చెబితే అంత మంచిది. ఏపీ మద్యం అంటేనే ఇతర రాష్ట్రాల వారు ఎగతాళి చేస్తున్నారు. అంతా ‘జే’ బ్రాండే కదా అని విమర్శిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం పాలసీని మార్చారు. ప్రైవేటు దుకాణాల స్థానంలో ప్రభుత్వ షాపులు తీసుకొచ్చారు. కొత్త కొత్త బ్రాండ్లు, దేశంలో ఎక్కడా వినిపించని మద్యాన్ని ఏపీకి పరిచయం చేశారు. ధర కూడా అందనంత దూరంలో ఉంచారు. ఏంటని అడిగితే మందుబాబులకు మద్యం నుంచి దూరం చేయడానికేనని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు డిజిటల్ పేతో ఆ మద్యం సీసాలేవీ స్కాన్ కావడం లేదు. దీంతో అవి దొంగ మద్యమా? అన్న సెటైర్లు పడుతున్నాయి.

    తన నవరత్నాల్లో సంపూర్ణ మద్య నిషేధం అని జగన్ ప్రకటించారు. ఏటా 25 శాతం షాపులు తగ్గించి.. నాలుగేళ్లకు సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులు వేస్తామని చెప్పుకొచ్చారు. ఆ షాపులు తగ్గకపోగా బార్లు రూపంలో పెరుగుతూ వస్తున్నాయి. నాలుగేళ్ల పాటు డిజిటల్ పే అన్నదే కనిపించలేదు. రూ.2 వేల నోటు రద్దు, పవన్ మద్యం అక్రమాలపై ప్రశ్నించేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో డిజిటల్ పేను ప్రారంభించారు. స్కానర్లు ఏర్పాటుచేశారు. అయితే సాంకేతిక సమస్యతో మద్యం సీసాలు స్కాన్ కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు.

    అయితే షాపుల వద్ద షో కోసమే డిజిటల్ పే క్యూఆర్ కోడ్ లు పెట్టారని.. అస్సలు అక్కడ నగదు రహిత లావాదేవీలు జరగడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ఫ్యాక్ట్ చెక్ లో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. జులై 8, 2023న తీసుకుంటే రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల పరిధిలో 67,818 మంది డిజిటిల్‌ పద్ధతుల్లోనే చెల్లింపులు జరిపారు. మూడు వేల దుకాణాలు ఉంటే.. అందులో అరవై వేల మంది మాత్రమే డిజిటల్ చెల్లింపులు చేశారు. కనీసం దుకాణానికి ఇరవై మంది కూడా డిజిటల్ చెల్లింపులు చేయరా ? 9వ తేదీన 93,227 మంది డిజిటిల్‌ పద్ధతుల్లోనే చెల్లింపులు జరిపారని చెప్పుకొచ్చారు. అయితే ఇది వాస్తవాలకు దూరమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    పవన్ ఇటీవల వ్యవస్థాగత లోపాలపై ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే మద్యం విధానాలపై విమర్శలు సంధించారు. అవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అలా పవన్ అన్నారో లేదో మద్యం దుకాణాల్లో క్యూఆర్ కోడ్లతో హడావుడి చేశారు. కానీ రోజుకు వందలాది మంది వస్తే పదుల సంఖ్యలో డిజిటల్ పేమెంట్లను చూపిస్తున్నారు. తద్వారా నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నట్టు చూపిస్తున్నారు. ఏపీ ఫ్యాక్ట్ చెక్ లో సైతం తేలిందిదే.