Homeఆంధ్రప్రదేశ్‌Professor Nageshwar cases truth analysis: ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు నిజమేనా.. ఆయన వాదనలో...

Professor Nageshwar cases truth analysis: ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు నిజమేనా.. ఆయన వాదనలో నిజమెంత

Professor Nageshwar cases truth analysis: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం షేక్ చేస్తోంది. జగన్ అరెస్టు గురించి ప్రస్తావించారు కాబట్టి వైసిపి మీడియా నాగేశ్వర్ కు అనుకూలంగా రాస్తోంది. నాగేశ్వర్ వ్యవహారంలోకి టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కూడా రంగప్రవేశం చేశారు. రాజకీయ నిరుద్యోగులు కూడా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు పెడితే.. ఆయనను గనక అరెస్టు చేస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

వాస్తవానికి ఈ వ్యవహారంలో నాగేశ్వర్ మీద ఏపీ ప్రభుత్వం ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. కేవలం జగన్ అరెస్ట్ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శించినందుకు నాగేశ్వర్ మీద జనసేన నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంతవరకు ఆ వ్యవహారం ఆగిపోయింది. అంతకుమించి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. అనవసరంగా రాద్ధాంతం ఎందుకని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏకంగా కేసులు నమోదు చేయకూడదని.. నాగేశ్వర్ ను అరెస్ట్ చేయకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

“ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో తనకు బాజాలు మోగించుకుంటున్నారు. తనను తాను గొప్ప వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నారు. శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఎంతమందికి సహాయం చేశారు.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏ స్థాయిలో కృషి చేశారని” జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఎటువంటి కేసులు నమోదు చేయకపోయినప్పటికీ.. ఆయనను అరెస్ట్ చేయకపోయినప్పటికీ.. యుద్ధం మీరు మొదలుపెట్టారు నేను ముగింపు ఇస్తానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయన మీద కేసులు పెట్టినప్పుడు ఎందుకు ఈ స్థాయిలో విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు.. కొంతమంది వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చి.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించడం ప్రొఫెసర్ నాగేశ్వర్ కు చెల్లిందని జనసేన నాయకులు మండిపడుతున్నారు..

“ఏ విషయంలో కూడా నిజం లేదు. ఇలా అబద్దపు మాటలు మాట్లాడిన వ్యక్తిని విశ్లేషకుడు అనుకోవాలా.. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడే వ్యక్తి విశ్లేషకుడు ఎలా అవుతాడు.. నాగేశ్వర్ న్యూట్రల్ ముసుగులో రాజకీయ పార్టీకి కొమ్ముకాసే విధానాలకు చరమగీతం పాడాలని” జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

“ప్రొఫెసర్ నాగేశ్వర్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారా.. కేసులు ఏమైనా నమోదు చేశారా.. ఆయన వాదనలో నిజం ఎంత ఉంది.. అనే విషయాలను ఇటీవల పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఆయన అనవసరంగా గొప్పగా ఊహించుకుంటున్నారు. నేరుగా పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం గురించి ముగింపు ఇవ్వాలని చెప్పినప్పటికీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అలానే మాట్లాడటం ఏమాత్రం సబబు కాదని” జనసేన నాయకులు అంటున్నారు..

కొద్దిరోజులపాటు ఈ వ్యవహారం ఇలానే సాగిపోతుందని.. ఆ తర్వాత దానంతట అదే ముగిసిపోతుందని జనసేన నాయకులు అంటున్నారు.. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం చెప్పారని.. ఇప్పటికైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ దీనికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని.. ఇకపై వాస్తవాలు మాత్రమే చెప్పాలని.. న్యూట్రల్ విశ్లేషణ మాత్రమే చేయాలని జనసేన నాయకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు హితవు పలుకుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular