Medical Colleges Privatization: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వంపై పట్టు బిగించాలని చూస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 18 నెలల కిందట ఘోర పరాజయం చవిచూసింది. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ యాక్టివ్ అవుతోంది. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై ప్రజా ఉద్యమానికి సిద్ధపడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తాము ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే.. ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతోంది. అయితే ప్రైవేటీకరణ అనే విషయానికి వచ్చేసరికి అనేక రకాల విమర్శలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఈ విధానాన్ని వ్యతిరేకించడం మాత్రం నిజంగా గుర్తించాల్సిన విషయం. ఎందుకంటే ఇదే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల నిర్వహణకు సంబంధించి ఆయన గతంలో ఇచ్చిన జీవోలు చూస్తే.. అదే వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారేంటి అనే ప్రశ్న వినిపిస్తుంది. ఇంతలోనే ఆయన మాట మార్చడం ఏమిటనేది ఇప్పుడు వాదన.
మంజూరు సరే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో 17 మెడికల్ కాలేజీలో కు సంబంధించి మంజూరు వాస్తవమే. కానీ అందులో ఒకటి కూడా నిర్మాణం పూర్తి కానీ అందులో ఒకటి కూడా నిర్మాణం పూర్తి చేయలేకపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. సగానికి పైగా పునాదుల స్థాయిలోనే ఉన్నాయి. మిగతావి వివిధ స్థాయి నిర్మాణాల్లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేయడం చాలా కష్టమని.. నిర్వహించడం కూడా అతి కష్టమని భావించిన చంద్రబాబు సర్కార్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ విధానం ద్వారా పూర్తి చేయాలని భావించింది. ఆ ప్రతిపాదన చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పేదల వ్యతిరేక నిర్ణయం గా అనిపించింది. ప్రైవేటీకరణ అనే విషయంలో సమాజంలో చాలా రకాల భావనలు ఉంటాయి. మిగతా వర్గాలు తప్పు పట్టొచ్చు కానీ.. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో తప్పు పట్టడం మాత్రం నిజంగా ఆశ్చర్యకర పరిణామమే.
ఫీజుల్లో వ్యత్యాసం అంతే..
ప్రభుత్వ మెడికల్ కాలేజీల( government medical colleges ) నిర్మాణ ప్రతిపాదన వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ లతో పాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల విషయంలో ఒక ఉత్తర్వు అప్పట్లో వచ్చింది. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు మూడు రకాలుగా ఉంటాయి. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఎన్నారై కోటా అనే మూడు విభాగాలు చూపించారు. కన్వీనర్ కోటా అనేది సాధారణ ధరల్లోనే ఉండేలా చూపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో రెండో ఫీజు విధానాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ గా చూపి.. 12 లక్షలు గా చూపారు. అదేవిధంగా ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద చెప్పి 12 లక్షల రూపాయలు ఫీజు గానే నిర్ణయించారు. చివరిది ఎన్నారై కోటా రెండు విభాగాల కాలేజీల్లోనూ అదే పేరుతో చూపించారు. అయితే అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 20 లక్షలు గా చూపారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మాత్రం 32 లక్షల వరకు ఫీజులుగా చూపించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో సైతం అదే తరహా ఫీజులు వసూలు చేస్తామని చెబుతున్నారు. అంతకుమించి భారం పడదని అంటున్నారు.
గతంలో చాలా వ్యవస్థలు అలానే…
గతంలో చాలా వ్యవస్థలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్( public private partnership) రూపంలో నడిచాయి. రాజశేఖర్ రెడ్డి మానస పుత్రికగా చెప్పుకుంటున్నారు ఆరోగ్యశ్రీని. ఆయన సూచించిన మార్గంలోనే దేశం మొత్తం ఆరోగ్యశ్రీ నడుస్తోందని చెబుతుంటారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ విధానం సైతం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ రూపంలోనే నడుస్తోంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో జరిగే ఆపరేషన్‌కు ప్రభుత్వం సాయం చేస్తోంది.. 108, 104 వాహనాల నిర్వహణ విషయంలో సైతం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ విధానం నడుస్తోంది. ఆ విధానాన్ని అనుసరించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని గగ్గోలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన అసలు లక్ష్యం స్పష్టంగా అర్థం అవుతోంది. ప్రైవేటీకరణ అనే అంశాన్ని భూతద్దంలో పెట్టి ప్రజల్లో ఒక అయోమయం క్రియేట్ చేయాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా.