https://oktelugu.com/

AP Assembly Election Results 2024: ఫుల్ డిమాండ్ లో చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఫోన్ చేసి చంద్రబాబుతో మాట్లాడారు. ఏపీలో కూటమి గెలుపు పై అభినందనలు తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 4, 2024 2:50 pm
    AP Assembly Election Results 2024

    AP Assembly Election Results 2024

    Follow us on

    AP Assembly Election Results 2024: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబు చర్యలు ప్రారంభించారు. అటు ప్రోటోకాల్ ప్రకారంగా పోలీస్ శాఖ చంద్రబాబుకు భద్రత పెంచింది. చంద్రబాబు నివాసంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సైతం భద్రతను పెంచారు. మరోవైపు ఈరోజు పవన్ తో చంద్రబాబు భేటీ కానున్నారు. క్యాబినెట్ కూర్పు పై చర్చించనున్నారు. ఇంకోవైపు దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి నేతలు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అన్ని పార్టీల నుంచి శుభాకాంక్షలు అందుకోవడం విశేషం.

    ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఫోన్ చేసి చంద్రబాబుతో మాట్లాడారు. ఏపీలో కూటమి గెలుపు పై అభినందనలు తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించారు. మరోవైపు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి చంద్రబాబుకు ఫోన్ చేశారు. శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని కోరారు. అటు పాత మిత్రులు సైతం చంద్రబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడం విశేషం. అందులో శరద్ పవర్ లాంటి సీనియర్ నేతలు చంద్రబాబుకు ఫోన్ చేయడం చూస్తుంటే.. జాతీయస్థాయిలో చంద్రబాబు కోసం ఇండియా కూటమి సైతం ప్రయత్నాలు చేస్తుందన్న టాక్ ప్రారంభమైంది.

    జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించింది. పొత్తులో భాగంగా 17 చోట్ల పోటీ చేసి.. 16 స్థానాల్లో గెలిచింది. ఇంకో వైపు ఎన్ డి ఏ కూటమికి దీటుగా ఇండియా కూటమి సైతం మెరుగైన స్థానాలను దక్కించుకుంది. ఎన్డీఏ పరంగా మ్యాజిక్ ఫిగర్ దాటినా.. బిజెపి పరంగా అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేదు. దీంతో మిత్రుల మద్దతు అనివార్యం. ముఖ్యంగా ఎన్డీఏ లో రెండో అతిపెద్ద పార్టీగా టిడిపి పాత్ర కీలకం. అటు సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే మరికొందరు మిత్రుల అవసరం. ఈ తరుణంలో చంద్రబాబు కీలకంగా మారనున్నారు. అందుకే ప్రధాని మోదీ చంద్రబాబుకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రోటోకాల్ ప్రకారం కాన్వాయ్ చంద్రబాబు నివాసానికి చేరుకుంది. మొత్తానికైతే ప్రమాణస్వీకారం చేసే వరకు చంద్రబాబు బిజీబిజీగా మారనున్నారు.