Narendra Modi : ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం ఢిల్లీలో శుక్రవారం(జూన్ 7న) నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్, జేడీఎస్ అధినేత కుమారస్వామి, శివనేస అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్‌నాథ్‌షిడే తyదితరులు హాజరయ్యారు.
ప్రధానిగా ఏకగ్రీవ ఎన్నిక..
ఈ సమావేశంలో నరేంద్రమోదీని ఎన్డీఏ పక్ష నేతగా కూటమి నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజనాథ్‌సింగ్ ప్రతిపాదించగా అమిత్‌షా, నితిన్‌గడ్కరీ మద్దతు తెలిపారు. తర్వాత ఎన్డీఏ కూటమిలోని పార్టీల అధ్యక్షుడు ఒక్కొక్కరుగా మాట్లాడుతూ మోదీకి మద్దతు తెలిపారు. చంద్రబాబు నాయకుడు మాట్లాడుతూ మోదీ దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. దూరదృష్టిగల మోదీ అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆయన విజన్ 2047 నాటికి నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వికసితభారత్‌లో తాము భాగస్వాములమవుతామని తెలిపారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం దేశాన్ని టచ్ చేయడానికి కూడా ఎవరూ సాహసించరని తెలిపారు. విజనరీ నాయకుల బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉనానమని పేర్కొన్నారు.
పవన్‌పై మోదీ ప్రశంసలు..
ఎన్డీఏ భాగస్యామ్య పక్ష నేతలంతా మాట్లాడిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో ఏకగ్రీవ నిర్ణయాలతో పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు తుపాను అని ప్రత్యేకంగా అభినందించారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు. ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన.. ఆ సమావేశంలోనే ఉన్న పవన్‌ను అభినందించారు.