Homeఆంధ్రప్రదేశ్‌CM Chandhrababu Delhi Tour : లడ్డూ వివాదం పై ప్రధాని ఆరా.. చంద్రబాబు ఏం...

CM Chandhrababu Delhi Tour : లడ్డూ వివాదం పై ప్రధాని ఆరా.. చంద్రబాబు ఏం చెప్పారంటే?

CM Chandhrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తూ వచ్చారు. నిన్న ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు చంద్రబాబు. సాయంత్రం ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వారిద్దరి మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా తిరుమల లడ్డు వివాదంపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు జాతీయ మీడియా వర్గాలు కథనాలను ప్రచురించాయి. ఎన్డీఏలో చంద్రబాబు కీలక భాగస్వామి. అందుకే గత కంటే భిన్నంగా ప్రాధాన్యత దక్కుతూ వస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలో కీలక అంశాలతో అడుగుపెట్టారు చంద్రబాబు. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక రైల్వే జోన్ తదితర అంశాలపైనే చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కేంద్రం అమరావతి రాజధాని నిర్మాణానికి 15000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. ప్రపంచ బ్యాంకు రుణం నుంచి ఇప్పించింది. అటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పలుమార్లు అమరావతిని సందర్శించారు. రుణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నవంబర్ మొదటి వారానికి 3750 కోట్లు విడుదల చేసేందుకు సమ్మతిస్తూ కేంద్రానికి లేఖ రాశారు.ఈ విషయం సైతం ప్రధాని వద్ద చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.వీలైనంత త్వరగా నిధులు విడుదలైన అందుకు చంద్రబాబు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.మరోవైపు పోలవరం ప్రాజెక్టు స్థితిగతులను ప్రధానికి వివరించారు చంద్రబాబు.దీనిపై కూడా సానుకూలంగా స్పందించారు మోడీ.మరోవైపు విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ అంశం సైతం వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్లో జరిగే శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానించారు చంద్రబాబు.

* దానిపైనే ఎక్కువ ఫోకస్
అయితే ఈ మూడు అంశాల కంటే తిరుపతి లడ్డు వివాదం పై ప్రధాని మోదీ ఎక్కువగా ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది? ఇందులో వైసిపి పాత్ర ఏంటి? గత ఐదేళ్ల కాలంలో టీటీడీ పవిత్రతను మంటగలిపేలా జరిగిన చర్యలు గురించి చంద్రబాబు ప్రధాని మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. అసలు తిరుపతికి ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తున్నారు? స్వామివారిని ఎంతమంది దర్శించుకుంటున్నారు? తీర్థ ప్రసాదాల పంపిణీ గురించి చంద్రబాబు పూర్తిగా ప్రధాని మోదీకి వివరించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో వైసిపి హయాంలో అన్యమత ప్రచారం,ఇతరత్రా జరిగిన చర్యల గురించి ఆయనకు వివరించే ప్రయత్నం చేశారు.

* అన్ని విషయాలను చెప్పిన చంద్రబాబు
తిరుమల లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు వాడారని చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీకి చంద్రబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్డీఏ శాసనసభ పక్షం సమావేశంలో చంద్రబాబు ఈ లడ్డు వివాదాన్నితెరపైకి తెచ్చారు.గుజరాత్ లోని ఎన్డిడిబి ల్యాబ్లో నెయ్యి నిర్ధారణ పరీక్షలు జరిగిన తర్వాత కల్తీ జరిగినట్లు తేలిందని.. అటు తరువాతే తాను ఆ విషయాన్ని వెల్లడించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.. ఈ విషయాలన్నింటినీ సావధానంగా విన్న ప్రధాని మోదీ చంద్రబాబును సముదాయించినట్లు సమాచారం. నేషనల్ మీడియా సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ కథనాలు ప్రచురించింది. చంద్రబాబు నివేదిక నేపథ్యంలో.. లడ్డూ వివాదంలో కేంద్రం చర్యలు ఎలా ఉంటాయో చూడాలి మరి. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్ ఏర్పాటుకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడవద్దని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ తరుణంలో సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక సిట్ దర్యాప్తు పైనే అందరి దృష్టి ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version