Homeఆంధ్రప్రదేశ్‌Modi: మోదీ నోట తొలిసారి జగన్ మాట

Modi: మోదీ నోట తొలిసారి జగన్ మాట

Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వచ్చారు. రాజమండ్రి, అనకాపల్లి సభల్లో పాల్గొన్నారు. వైసిపి తో పాటు జగన్ పై టార్గెట్ చేసుకున్నారు. దీంతో కూటమి పార్టీల్లో ఒక రకమైన ఖుషి కనిపిస్తోంది. ప్రధాని సంతృప్తికరమైన కామెంట్స్ చేశారని మూడు పార్టీల శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. గత నెలలో చిలకలూరిపేట సభకు హాజరైన మోడీ జగన్ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేయలేదు. పొడిపొడిగా మాట్లాడేసి వెళ్ళిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తం అయ్యింది. అయితే నిన్నటి సభల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి సంతృప్తికరంగా.. జగన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ.

తొలుత రాజమండ్రి సభలో ప్రధాని మోదీ వైసీపీ సర్కార్ విధానాలను తప్పుపట్టారు. అనకాపల్లి సభలో మాత్రం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి బెల్లం అంతర్జాతీయ ఖ్యాతి పొందిందని.. అలాంటి తీయటి ప్రభుత్వమే ఏపీలో ఏర్పడనుందని చెప్పారు. జూన్ 4న వచ్చే ఫలితాలు ఇంతకన్నా తీయగా ఉంటాయని.. ఏపీలో కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుందని మోడీ స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేందుకు తాము రెడీగానే ఉన్నామని.. కానీ ఇక్కడి ప్రభుత్వమే భూమి ఇవ్వడం లేదని మోడీ విమర్శించారు. ఏపీలో అవినీతి తప్ప ఇంకేమీ కనిపించడం లేదని హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రం ఏపీలో ఎంతో అభివృద్ధి చేస్తుంటే.. ఇక్కడున్న వైసీపీ మాత్రం ఎందుకు చేయడం లేదని ప్రధాని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టు పై సైతం ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టు కోసం కృషి చేశారని.. ఆయన కుమారుడు జగన్ మాత్రం ఏ పని చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం 15000 కోట్లుఇచ్చిందని.. ఆ నిధులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. రైతుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ప్రధాని మోదీ తేల్చేయడం విశేషం.

వైసీపీ తారక మంత్రం అవినీతి అవినీతి అవినీతి అంటూ.. ప్రధాని పదే పదే ప్రస్తావించటం గమనార్హం. చివరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులను సైతం రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ నిర్వాకం మూలంగానే అనకాపల్లి రైతులు చెరుకు పండించడం మానేశారని కూడా ఆరోపణలు చేశారు. ఏపీలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా కొనసాగుతోందని కూడా మోడీ ఆరోపించారు. కాంగ్రెస్, వైసిపి ఒక్కటేనని కూడా దుయ్యబట్టారు. మొత్తానికైతే అటు వైసీపీ సర్కార్ తో పాటు ఇటు జగన్ పై విమర్శలు చేయడంలో ప్రధాని ముందు వరుసలో నిలిచారు. అయితే గత ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ విషయంలో బిజెపి ఉదాసీనంగా వ్యవహరించింది. కానీ ఈ ఎన్నికలవేళ జగన్ ను ప్రధాని మోదీ టార్గెట్ చేసుకోవడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version