PM Modi AP Tour Schedule: ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 16న ఏపీకి రానున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఫుcల్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈనెల 16న ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని బయలుదేరుతారు. ఉదయం 10 20 గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి సున్నిపెంట వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు మోదీ చేరుకుంటారు. 10:10 గంటలకు రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. 11:45 గంటలకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1:40 కి సున్నిపెంట హెలిపాడ్ నుంచి నన్నూరు హెలిపాడ్ కు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్తారు. అక్కడ పురావస్తు శాఖ ఏర్పాటు చేసి ప్రదర్శనను తిలకిస్తారు.
* మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాగ మయూరి గ్రీన్ హిల్స్ వెంచర్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.
* సాయంత్రం నాలుగు గంటలకు భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
* సాయంత్రం 4:15కు రోడ్డు మార్గంలో నన్నూరు హెలిపాడ్ కు చేరుకొని.. అక్కడినుంచి 4:40కు కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
* సూపర్ జీఎస్టీ సూపర్ హిట్ సభలో ప్రధాని మోదీ తో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు.
* మంత్రి లోకేష్ సమీక్ష..
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించారు మంత్రి నారా లోకేష్. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. దీపావళి సందర్భంగా 16 నుంచి 19 వరకు జిల్లా కేంద్రాల్లో గ్రాండ్ జీఎస్టీ షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఉండవల్లి లోని తన నివాసంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్య కుమార్ యాదవ్, వంగలపూడి అనిత, సిఎస్ విజయనంద్, సి ఎం ఓ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు లోకేష్. మరోవైపు ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు మూడు లక్షల మంది ప్రజలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రధాని భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. 40 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను, ప్రజలు సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు పదివేల బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి పార్కింగ్ గాను 347 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేశారు.