Projects In AP : ఏపీలో( Andhra Pradesh) పారిశ్రామిక అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. తద్వారా ఈ రాష్ట్ర స్వరూపమే మారిపోతుందని చెప్పుకొస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అన్నది ప్రభుత్వ వాదన. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు( Industries established ) ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. రెండు రోజుల కిందట ప్రధాని మోదీ( PM Modi) విశాఖలో రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి శ్రీకారం చుట్టారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కు( special railway zone) శంకుస్థాపన చేశారు. ఇంకోవైపు గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. విశాఖ జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సైతం శ్రీకారం చుట్టారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ అంత సీన్ లేదని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా వైసిపి అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున దీనిపై వ్యతిరేక ప్రచారం నడుస్తోంది.
* 57 వేల మందికి ఉద్యోగాలు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టిపిసి గ్రీన్ హైడ్రోజన్ హబ్( green hydrogen hub ) ఏర్పాటు చేయనున్నారు. దీనికి ప్రధాని శంకుస్థాపన చేశారు. 1200 ఎకరాల్లో లక్ష 85 వేల కోట్ల భారీ పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టిపిసి అనుబంధ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ హబ్ ఏర్పాటు కానుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 57 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. 2028 నాటికి ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలన్నది టార్గెట్. రోజుకు 15 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాస్తవానికి ఇక్కడ పదేళ్ల కిందట ధర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ సాధ్యం కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆయన విన్నపం మేరకు గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చింది. దీంతో దాదాపు 60 వేల మంది వరకు ఉపాధి పొందే అవకాశం ఉంది.
* స్టీల్ ప్లాంట్ తో 45 వేల మందికి
అనకాపల్లి సమీపంలోని నక్కపల్లి రాజయ్యపేట వద్ద అర్సలర్ మిట్టల్ కంపెనీ ( harshalar Mittal ) భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించింది. జపాన్ కు చెందిన నిప్పన్ స్టిల్స్ తో సంయుక్తంగా ఇక్కడ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దాదాపు 2200 ఎకరాల్లో.. 70 వేల కోట్ల పెట్టుబడులతో ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. 2029 నాటికి మొదటి దశ ప్లాంట్ పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ ప్లాంట్ నిర్మాణ సమయంలో 25,000 మందికి… నిర్వహణకు 20వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అంటే దాదాపు 45 వేల మందికి ఉపాధి దొరకనుందన్నమాట. అయితే ప్లాంట్ రెండో దశ విస్తరణలు మరింత ఎక్కువ మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు దక్కే చాన్స్ కనిపిస్తోంది.
* చిరకాల వాంఛ రైల్వే జోన్
రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక రైల్వే జోన్( special railway zone). దానిని ఎట్టకేలకు సహకారం చేసింది కేంద్ర ప్రభుత్వం. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేసింది. ఇది శుభ పరిణామం. ఆహ్వానంద్ తగ్గ పరిణామం. కొత్తగా ఉద్యోగాల మాట అటుంచి.. ఏపీకి, ప్రత్యేకంగా ఉత్తరాంధ్రకు ప్రయోజనం చేకూరే అంశం ఇది. కొత్త జోన్ కు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో.. కొత్తగా జనరల్ మేనేజర్ ను నియమించింది రైల్వే బోర్డు. ప్రస్తుతం తాత్కాలిక కార్యాలయంలో విశాఖ రైల్వే జోన్ ప్రారంభం కానుంది. కానీ మొత్తం 12 అంతస్తుల్లో నిర్మితం కానున్న విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి 149 కోట్లను బడ్జెట్లో కేటాయించింది కేంద్రం. మరో రెండు సంవత్సరాల కాలంలో ఈ కార్యాలయ భవనాలు పూర్తి కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రత్యేక రైల్వే జోన్ తో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయాణికులతో పాటు ఉద్యోగులకు వసతులు మెరుగు పడనున్నాయి. మరిన్ని రైలు అందుబాటులోకి రానున్నాయి. సమస్యల సైతం వీలైనంత త్వరగా పరిష్కారం కానున్నాయి. ప్రమాదాలతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో వీలైనంత త్వరగా సహాయక చర్యలు అంది అవకాశం ఉంది. ప్రత్యేక పర్వదినాల సమయంలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఫోకస్ డెవలప్మెంట్ కచ్చితంగా జరుగుతుంది. ప్రజా రవాణా తో పాటు గూడ్స్ రవాణా కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయి. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.