KA Paul: అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సరికాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అయితే సడన్ గా ఈ ఎపిసోడ్ లోకి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చారు. సహజంగానే కేఏ పాల్ అంటేనే మనకు నవ్వొస్తుంది. ఆయన హావా భావాలు.. పలికే మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. లాజిక్ కు దూరంగా ఉంటే ఆయన విశ్లేషణలు బాబోయ్ అనేలా చేస్తాయి. ఒక్కోసారి మాత్రం ఆయన మాట్లాడే మాటలు సూటబుల్ గా ఉంటాయి. క్వశ్చనబుల్ గా ఉంటాయి. అందువల్లే సోషల్ మీడియాలో కేఏ పాల్ అంటే విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. ఆయన కోసం ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంగా కేఏ పాల్ లేవనెత్తిన ప్రశ్నలు ఆలోచించే విధంగా ఉన్నాయి. అంతేకాదు టిడిపి నేతలు తల పట్టుకునేలా ఉన్నాయి.
ఆయన్ని అరెస్ట్ చేస్తారా
అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా కే ఏ పాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. “సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు.. అరెస్టు కూడా చేశారు. అలా అయితే చంద్రబాబు నాయుడు ని కూడా అరెస్ట్ చేయాలి. ఈ ఏడాది ఎన్నికలు జరిగే సమయానికి ముందు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగి చాలామంది కన్నుమూశారు. అంతకుముందు గోదావరి పుష్కరాల సమయంలో నిర్వహించిన కార్యక్రమంలో 23 మంది చనిపోయారు. వీటన్నిటికీ చంద్రబాబు కారణం. అలాంటప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేస్తారా” అంటూ పాల్ సరికొత్త ప్రశ్నను లేవనెత్తారు. ఈ వీడియోను అల్లు అర్జున్ అభిమానులు, భారత రాష్ట్ర సమితి, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తెగ ప్రచారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు వేళ పాల్ మాట్లాడిన మాటలకు మీడియా ముఖ్యమైన ప్రాధాన్యం ఇవ్వడంతో సంచలనం గా మారింది. ” అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి మీడియా ఉదయం నుంచి అవే వార్తలను ప్రసారం చేస్తోంది. అకస్మాత్తుగా పాల్ ఎంట్రీ ఇచ్చారు. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మీడియా మొత్తం అటెన్షన్ మార్చుకుంది. ఇప్పుడు పాల్ వార్తలను ప్రసారం చేయాల్సి వస్తోంది. మీడియా మేనేజ్మెంట్ ఎలా చేయాలో పాల్ కు బాగా తెలుసు. పాల్ ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయిపోయాడని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబును కూడా అరెస్ట్ చేస్తారా? #AlluArjunArrest pic.twitter.com/hoRIGWpyl6
— Be With Jagan (@BewithJagan) December 13, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Prajashanti party leader ka paul reacted to allu arjuns arrest
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com