AP Elections 2024: జనసైనికులకు వైసిపి పూనకాలు తెప్పిస్తోంది. ఎన్నికల వేళ అనవసరంగా వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అది అంతిమంగా ఆ పార్టీకే నష్టం. పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయంతో వైసీపీకి ఏం చేయాలో పాలు పోవడం లేదు. అందుకే పవన్ ను టార్గెట్ చేసేందుకు ఇద్దరు ముగ్గురు నేతలను పక్కన పెట్టుకుంది. రాష్ట్రస్థాయి ఫైర్ బ్రాండ్ నేతలు తమ సొంత నియోజకవర్గాల్లో బిజీగా ఉండడంతో ఒకరిద్దరు పెయిడ్ నేతలను పెట్టుకుంది. పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసేందుకు, రూమర్స్ ప్రచారం చేసేందుకు పోసాని కృష్ణ మురళి, పోతిన మహేష్ వంటి నేతలను రంగంలోకి దించుతోంది.అయితే వీరు లైన్ దాటి మాట్లాడుతున్నారు. పవన్ పై వ్యక్తిగత దాడి చేస్తున్నారు. వారి కామెంట్స్ విన్నాక జనసైనికుల్లో ఒక రకమైన కసి కనిపిస్తోంది. ఎన్నికల్లో బాగా పనిచేయాలన్న ప్రయత్నం జరుగుతోంది.
పోతిన మహేష్.. ఈరోజు వైసీపీకి అవసరమయ్యారంటే.. దానికి ముమ్మాటికీ కారణం పవన్. ఎక్కడో విజయవాడలో ఉండే గల్లీ లీడర్ ఆయన. జనసేనలో పోటీకి అవకాశం ఇచ్చి.. గత ఐదేళ్లుగా విజయవాడ నగర బాధ్యతలు అప్పగించడంతో ఆయన స్టేట్ లీడర్ అయ్యారు. నిన్నటి వరకు తాను పవన్ నీడలో పెరిగానన్న విషయాన్ని మరిచిపోయిన పోతిన మహేష్ ఆయనపైనే విషం చిమ్ముతున్నారు. తాను జనసేనకు అన్యాయం చేస్తే కొబ్బరి బొండాల కత్తితో నరకాలని పోతిన మహేష్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే పోతిన మహేష్ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ తో వైసీపీకి ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా ఈ కామెంట్స్ ప్రజల్లో అసహనానికి కారణమవుతున్నాయి.
సాధారణంగా పోసాని కృష్ణమురళి కానీ, పోతిన మహేష్ కానీ మీడియా ముందు చేసే వ్యాఖ్యలు ఒక మాదిరిగా ఉండవు. అవి పవన్ ఫ్యాన్స్, జనసేన అభిమాన ఓటర్లతో పాటు తటస్తుల్లో కూడా ప్రభావం చూపుతాయి. ఒక రకమైన వ్యతిరేకతకు కారణమవుతాయి. కానీ నష్టమని తెలిసినా వైసిపి ఇటువంటి వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలు వైసీపీ ఉద్దేశ్యం ఏమిటంటే తెలియడం లేదు.
ఈ ఇద్దరు నాయకులు మీడియా ముందుకు వస్తే పాలసీలపై మాట్లాడరు. పార్టీల విధానాలపై వ్యాఖ్యానించరు. నోరు తెరిస్తే పవన్ మూడు పెళ్లిళ్లు, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడతారు. కుటుంబాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. అయితే ఇవి ప్రతికూల ఫలితాలు ఇస్తాయని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కానీ పెద్దలకు ఇంపైన వ్యవహారం కావడంతో.. తాము ఏమి అనలేక నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తోంది