https://oktelugu.com/

Posani Krishna Murali : రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేసిన పోసాని..జీవితంలో పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళను అంటూ కామెంట్స్!

పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో పోసాని మీద కూడా కేసు నమోదు అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 21, 2024 / 09:50 PM IST

    Posani Krishna Murali

    Follow us on

    Posani Krishna Murali : సినీ నటుడిగా,రచయితగా,దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళి, రాజకీయాల్లోకి అడుగుపెట్టి పదునైన మాటలతో ప్రత్యర్థులను విమర్శించిన సందర్భాలను ఎన్నో మనం చూసాము. 2009 వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన పోసాని కృష్ణ మురళి, ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లోకి విలీనం చేసిన తర్వాత నుండి వైసీపీ పార్టీ లో చేరిన పోసాని కృష్ణ మురళి, అప్పటి నుండి నేటి వరకు వేరే పార్టీ మారకుండా, వైసీపీ లోనే కొనసాగుతూ వచ్చాడు. మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఆఫర్ చేసినప్పటికీ కూడా తీసుకోకుండా నిస్వార్థంగా ఆ పార్టీ కోసం ఇన్నాళ్లు పని చేస్తూ వచ్చాడు.

    ఎవరైనా వైసీపీ పార్టీ పై విమర్శలు చేస్తే, వాళ్లపై ఈయన నోరు ఎవ్వరూ ఊహించని రీతిలో పారేసుకునేవాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఆయన ఏ స్థాయిలో తిట్టాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ తల్లిని, కూతుర్లని కూడా వదలకుండా అత్యంత నీచమైన పదజాలంతో, సభ్య సమాజం సిగ్గుపడేలా, ఆయన సొంత ఇంట్లో మనుషులు కూడా అసహ్యించుకునే రేంజ్ పదాలు ఉపయోగించాడు. దీనిపై అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు పోసానిపై దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీస్ సెక్యూరిటీ తో ఆయన బయట తిరిగేవాడు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది.పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో పోసాని మీద కూడా కేసు నమోదు అయ్యింది.

    త్వరలోనే ఆయన అరెస్ట్ కాబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పోసాని కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ‘నేను ఇన్ని రోజులు రాజకీయ పరంగా, నేను ఇష్టపడిన నాయకుడిని ఎలా పొగుడుతూ వచ్చానో మీ అందరికీ తెలుసు. నిజాయితీ గల నాయకులను ఎల్లప్పుడూ పొగుడుతూ ఉండడం, వాళ్లకి సపోర్టుగా నిలబడి నేను మాట్లాడిన తీరుని కూడా మీరంతా గమనించారు. ఇక మీదట నేను రాజకీయాలకు దూరం గా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ క్షణం నుండి నేను చనిపోయే వరకు నా కుటుంబం కోసం బ్రతుకుతాను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ రాజకీయాల జోలికి వెళ్లను. సాక్షి టీవిలో ఈమధ్యనే డింగ్ డాంగ్ అనే ప్రోగ్రాం చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ప్రోగ్రాం రాజకీయాలకు సంబంధించినది కాబట్టి, అందులో నుండి కూడా తప్పుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు పోసాని కృష్ణ. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.