Posani Krishna Murali : పోసాని.. ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడే!

గత కొద్దిరోజులుగా పోసాని కృష్ణమురళి కనిపించడం లేదు.వైసిపి ఓడిపోయిన తర్వాత ఆయన నటించిన సినిమాలు సైతం రావడం లేదు. ఈ తరుణంలో ఆయన విషయంలో ఒక ప్రచారం ప్రారంభమైంది. ఓ టీవీ షో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : November 3, 2024 12:15 pm

Posani Krishna Murali

Follow us on

Posani Krishna Murali : తెలుగు చిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలి గా పేరు తెచ్చుకున్నారు పోసాని కృష్ణ మురళి. అక్కడి నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగెట్రం చేశారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేస్తున్నారు. జగన్ కు బలమైన మద్దతుదారుడుగా ఉన్నారు. వైసీపీలో కొనసాగుతున్న అతికొద్ది టాలీవుడ్ ప్రముఖుల్లో పోసాని ఒకరు. పార్టీ వాయిస్ ను గట్టిగానే వినిపిస్తారు. జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే తీవ్రస్థాయిలో మండిపడతారు. చివరకు మెగాస్టార్ కుటుంబాన్ని సైతం విడిచిపెట్టలేదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకు మెగా అభిమానులు నుంచి ఇబ్బందికర పరిస్థితులను సైతం ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పోసాని కృష్ణ మురళి కొద్ది రోజులపాటు సైలెంట్ అయిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే పోసాని విషయంలో లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఆయన త్వరలో టీవీ షో నిర్వహించనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇదేదో పొలిటికల్ రివేంజ్ ప్లాన్ అన్నట్లు ఉంది. దీంతో పోసాని కొత్త అవతారం ఎత్తుతారని టాక్ ప్రారంభం అయింది.

* చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం
తెలుగు చిత్ర పరిశ్రమలు పోసాని కృష్ణమురళిది ప్రత్యేక స్థానం. రచయిత, దర్శకుడిగా సుపరిచితుడు. ఎన్నో హిట్ చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. 2007లో ఆపరేషన్ దుర్యోధన, 2008లో ఆపదమొక్కులవాడు చిత్రాలకు దర్శకత్వం వహించినది పోసాని కృష్ణ మురళి. ఇందులో ఆపరేషన్ దుర్యోధన పెద్ద విజయం సాధించింది. 100కు పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ వచ్చారు పోసాని. అయితే మెగా కుటుంబంతో రాజకీయ శత్రుత్వం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు సినిమా అవకాశాలు తగ్గినట్లు ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఏదో షోకు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా సరికొత్త టాక్ తెరపైకి వచ్చింది.

* పీఆర్పీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ
2009లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు కృష్ణ మురళి. కానీ ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అటు తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయింది. కొద్ది రోజులకే వైసీపీ ఆవిర్భవించింది. అప్పటినుంచి జగన్కు అభిమానిగా మారిపోయారు పోసాని కృష్ణ మురళి. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడంలో ముందుండేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ పిలిచి మరి పోసాని కృష్ణ మురళికి పదవి ఇచ్చారు. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. దీంతో మరింత రెచ్చిపోయారు పోసాని. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ ఓ టీవీ షోకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి.