Homeఆంధ్రప్రదేశ్‌Political family ties Andhra Pradesh: ఏపీలో పొలిటికల్ వియ్యాలు..

Political family ties Andhra Pradesh: ఏపీలో పొలిటికల్ వియ్యాలు..

Political family ties Andhra Pradesh: ఏపీలో( Andhra Pradesh) రాజకీయ వియ్యం కొనసాగుతూనే ఉంది. రాజకీయ నేతలు తమ పిల్లలను వివాహాలు చేస్తున్నారు. తాజాగా రాయలసీమ ప్రాంత ఎమ్మెల్యే ఒకరు.. గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేతో వియ్యం అందుకోబోతున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కుమారుడు.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తెల వివాహం ఖాయం అయ్యింది. ఏప్రిల్ 2న హైదరాబాదులో వివాహం జరగనుంది. ఈ మేరకు ఆ ఇరువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆహ్వానాలు అందిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కు ప్రత్యేకంగా ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయ ప్రముఖులకు ఇప్పుడు ఆహ్వానాలు అందుతున్నాయి.

ప్రముఖుల మధ్య వియ్యం
మన రాష్ట్రంలో వియ్యం అందుకున్న రాజకీయ కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu), హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వియ్యంకులు. మంత్రి నారాయణ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకులు. ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ లు వియ్యంకులు. దివంగత కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రంనాయుడు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వియ్యంకులు. ఎర్రం నాయుడుకు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వియ్యంకుడు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టిడిపి నేత సుబ్బారెడ్డి వియ్యంకులు. మాజీ మంత్రి బొత్స, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వియ్యంకులు. ఇలా పొలిటికల్ వియ్యం అనేది కొత్త కాదు. ఇప్పుడు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, వెంకటరెడ్డి దంపతుల కుమారుడు జనార్దన్ రెడ్డి.. అనపర్తి ఎమ్మెల్యే నెల్లిమెల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతుల కుమార్తె సనాతని ల వివాహం కానుండడంతో వీరు ఇప్పుడు కొత్తగా వియ్యంకులు కాబోతున్నారు.

Also Read: వైసీపీని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి

రాజకీయ బంధుత్వాలు అధికమే..
అయితే ఏపీలో రాజకీయ కుటుంబాల ( political families) మధ్య బంధుత్వాలు అధికం. కానీ అవి పెద్దగా బయటపడవు. రాజకీయ ప్రత్యర్థులు సైతం బంధుత్వాలు కొనసాగిస్తున్న వారు ఉన్నారు. అయితే కిందిస్థాయి కార్యకర్తలు మాత్రం విభేదించుకుంటారు. కానీ రాజకీయాల్లో అలా ఉండదు. బంధువులు ఒక్కోచోట.. ఒక్కో పార్టీలో ఉంటే రాజకీయ ఇబ్బందులు అధిగమించవచ్చు కదా అన్న ఆలోచన. ఒకరికి ఇబ్బందులు వస్తే ఒకరు ఆదుకునే పరిస్థితి ఉంటుంది. ఏపీ రాజకీయాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version