Police Reels: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలామంది రీల్స్ చేయడం మొదలుపెట్టారు. రీల్స్ ద్వారా చాలామంది సెలబ్రిటీలు కూడా అయ్యారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకొని భారీగా సంపాదిస్తున్నారు కూడా.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారిపోయి కోట్లకు పడగలెత్తుతున్నారు. సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉండడంతో ఇటువంటి వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.
రీల్స్ చేయడంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పోటీపడుతున్నారు.. అయితే ఇప్పుడు ఈ జాబితాలో పోలీసులు కూడా చేరిపోయారు. పోలీసులకు నిత్యం శాంతిభద్రతల పర్యవేక్షణ, బందోబస్తు, నేరగాళ్ల ఆట కట్టించడం వంటి పనులు ఉంటాయి.. పడుకునే సమయం మినహా మిగతా అన్ని సందర్భాల్లో వారు విధి నిర్వహణ చేయాల్సి ఉంటుంది. పోలీసు ఉద్యోగాన్ని ఒకరకంగా కత్తి మీద సాములాగా భావిస్తుంటారు.. అయితే అప్పుడప్పుడు పోలీసులు ఆటవిడుపు కోసం.. ఒత్తిడిని జయించడానికి తాపత్రయపడుతుంటారు.. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తుంటారు. మరికొందరేమో విందులు వినోదాలు చేసుకుంటారు.
హైదరాబాద్ నగరంలో పాతబస్తీ లో ఓ పోలీస్ స్టేషన్లో మాత్రం పోలీసులు తమ ఒత్తిడిని చేయించడానికి డిఫరెంట్ ప్లాన్ చేశారు.. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన రీల్స్ చేశారు. తమ రీల్స్ కు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా లో పాటను ఉపయోగించుకున్నారు. కాలమే కనిపించినా మరలా వచ్చెను నాయకుడు.. అనే పాటకు రీల్స్ చేశారు. ఓ పోలీసు అధికారి కళ్ళకు గాగుల్స్ పెట్టుకుని ఉండగా.. మిగతా సిబ్బంది ఆయన చుట్టూ చేరి నృత్యాలు చేశారు.. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలోకి వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.. పోలీసులు అచ్చం సినిమాలో మాదిరిగా హావ భావాలను ప్రదర్శించారని నెటిజన్లు పేర్కొంటున్నారు.. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా పోలీసులు ఇలా రీల్స్ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వారి మీద ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడమే కాదు.. మిగతా వారికి ఎంటర్టైన్మెంట్ పంచారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులకు అప్పుడప్పుడు ఇటువంటి ఆటవిడుపు ఉండాలని. . అప్పుడే వారు ఒత్తిడి నుంచి బయటపడతారని నెటిజన్లు సూచిస్తున్నారు. సాధారణంగా ఇటువంటి రీల్స్ చేయడం ద్వారా పోలీసుల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని వారు పేర్కొంటున్నారు. అయితే రీల్స్ సరదాగా మాత్రమే ఉండాలని.. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల మాదిరిగా ఉండకూడదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
కమల్ హాసన్ విక్రమ్ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేసిన హైదరాబాద్ ఓల్డ్ సిటీ పోలీసులు pic.twitter.com/IJioDeMEHb
— Telugu Scribe (@TeluguScribe) November 22, 2025