Homeఆంధ్రప్రదేశ్‌Centre review Polavaram construction: పోలవరం పై కేంద్రం ఆరా.. అలా చేస్తే తప్పు!

Centre review Polavaram construction: పోలవరం పై కేంద్రం ఆరా.. అలా చేస్తే తప్పు!

Centre review Polavaram construction: పోలవరం( polavaram) పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు వారం వారం సమీక్ష చేస్తూ అధికారులతో పాటు కాంట్రాక్టర్ ప్రతినిధులకు కీలక సూచనలు చేస్తున్నారు. అయితే గతంలో రివర్స్ టెండరింగ్ విధానంతో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ సంస్థకు పనులు అప్పగించింది. అయితే ఆ తప్పు సీఎం చంద్రబాబు చేయలేదు. పదే పదే కాంట్రాక్టు సంస్థను మార్చితే.. ఆ ప్రభావం పనులపై పడుతుందని.. అందుకే మేఘా ఇంజనీరింగ్ సంస్థను కొనసాగించారు. అయితే గత ప్రభుత్వం మాదిరిగా పనుల్లో లోపాలు వెలుగు చూడకూడదని స్పష్టమైన హెచ్చరికలు కూడా పంపారు. అయితే ఇప్పుడు సదరు మేఘా కంపెనీ పనులపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆ సంస్థను తప్పించి..
టిడిపి ప్రభుత్వ హయాంలో నవయుగ సంస్థ పోలవరం పనులు చేసింది. సగం వరకు పనులు సదరు సంస్థ పూర్తి చేయగలిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో, తక్కువ ధరకే పనులు చేస్తామన్న ప్రతిపాదనతో మేఘా ఇంజనీరింగ్ సంస్థను రంగంలోకి దించింది. అయితే ప్రస్తుత పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డయాఫ్రం వాల్ దెబ్బ తినడంతో ఇప్పుడు నిర్మాణ సంస్థ పై లోతుగా చర్చ నడుస్తోంది. ఒక ప్రభుత్వం అప్పగించిన కాంట్రాక్టును తరువాత ప్రభుత్వం రద్దు చేస్తున్న క్రమంలో.. చంద్రబాబు సర్కార్ జగన్ ప్రభుత్వం అప్పగించిన మేఘా సంస్థను కొనసాగించారు. అయినా సరే మరోసారి అటువంటి ఆరోపణలు రావడం మాత్రం నిజంగా బాధాకరం..

Also Read: విశాఖకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. స్వరూపమే మారిపోనుంది!

బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి..
పోలవరం ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. ప్రత్యేక పరిస్థితుల్లో నిర్మాణ బాధ్యతలను అందుకుంది మేఘా కంపెనీ. అటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నాణ్యత లోపాలు బయటపడితే.. రాష్ట్రానికి మించి సదరు నిర్మాణ సంస్థకు చాలా చెడ్డ పేరు. అంతర్జాతీయ స్థాయిలో కూడా దాని పేరు పడిపోతుంది.. తక్కువ ధరకే టెండర్లు దక్కించుకున్నప్పటికీ.. డిజైన్ల మేరకు పనులు చేయకపోతే ఆ సంస్థ భవిష్యత్ ప్రమాదంలో పడినట్టే. ప్రస్తుతం కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది ఆ పనులను. ఇప్పటికే మేఘా కంపెనీ పై ఒక ముద్ర ఉండగా.. కేవలం పనులపై ప్రభావం చూపకూడదని చంద్రబాబు దాని నిర్మాణ బాధ్యతలను కొనసాగించారు. ఇటువంటి సమయంలో ఆ ఆరోపణలు రావడం మాత్రం సహేతుకం కాదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
Oktelugu Epaper
Exit mobile version