PMAY-G NTR Housing Scheme: ఏపీ( Andhra Pradesh) ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇల్లు లేని వారి కోసం ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా ఇల్ల నిర్మాణాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ ఐదు లక్షల ఇళ్ల పంపిణీ పై ఏపీ ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేపట్టాలని ఆదేశించారు. అయితే కొత్తగా ఇళ్ల మంజూరుకు సైతం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మొన్ననే హౌస్ ఫర్ ఆల్ పేరిట సర్వే పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ళు మంజూరు చేసేలా ప్రణాళిక వేసింది ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వంతో కలిసి..
కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం ఆవాస్ యోజన తో( pm Aawas Yojana) కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. పీఎం ఆవాస్ యోజన- ఎన్టీఆర్ పథకం పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటీవలే కొత్త ఇళ్ల నిర్మాణాల కోసం దరఖాస్తులు కూడా స్వీకరించారు. కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతంలో రూ. 1.59 లక్షలు ప్రభుత్వం అందిస్తోంది. అలాగే పట్టణాలు ఇల్లు నిర్మించుకునే వారికి రూ. 2.50 లక్షల చొప్పున సాయం అందిస్తోంది.. దరఖాస్తుల గడువు ఇటీవల పూర్తయింది. త్వరలోనే అర్హుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఆ జాబితా ప్రకటన తర్వాత లబ్ధిదారులతో ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నారు అధికారులు. అయితే గత వైసిపి ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లను పూర్తిచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉగాది నాటికి సామూహిక గృహప్రవేశాలు నిర్వహించనున్నారు.
పేదలందరికీ సొంతిల్లు..
కేంద్ర ప్రభుత్వంతో( central government) కలిసి పేదలకు సొంతింటి కల సాకారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇల్లు కట్టుకునేందుకు సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సొంత స్థలం లేని వారికి సమకూర్చనున్నారు. అందుకే హౌస్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించారు. అయితే దీనికి భారీగా స్పందన వచ్చింది. ఎప్పటికప్పుడు గడువు పెంచుకుంటూ వచ్చారు.. ఇటీవలే తుది గడువు ముగిసింది. అయితే ఉగాదిలో ఇప్పటివరకు మంజూరైన ఇళ్లకు గృహప్రవేశాలు చేయనున్నారు. అటు తరువాత కొత్త ఇళ్లు మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తానికి అయితే ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్కరి గృహ నిర్మాణ కల సాకారం చేసే ప్రయత్నంలో ఉందన్నమాట.