https://oktelugu.com/

PM Modi: 8న విశాఖకు మోడీ.. సంచలన నిర్ణయాలు.. ప్లాన్ అదే

ఈనెల 8న ప్రధాని మోదీ విశాఖ రానున్నారు. లక్షల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఏపీ గురించి కీలక ప్రకటనలు చేస్తారని తెలుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 2, 2025 / 11:31 AM IST

    PM Modi(1)

    Follow us on

    PM Modi: ఏపీ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏపీ విభజన తర్వాత కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చింది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు టిడిపి కీలక భాగస్వామి. కానీ నాడు ఏపీ విషయంలో కేంద్రం సరైన రీతిలో స్పందించడం లేదన్న ఆగ్రహంతో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయారు చంద్రబాబు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చింది ఎంబీఏ. కానీ ఏపీలో మాత్రం వైసిపి అధికారంలోకి రాగలిగింది. అయితే కేంద్రంలో అంతులేని మెజారిటీని సొంతం చేసుకున్న ఎన్డీఏ ఏపీ విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ. ఏపీలో సైతం టిడిపి నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించింది. అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మెజారిటీని అందించింది ఏపీ. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కీలక భాగస్వామి కూడా. అందుకే ఇప్పుడు విభజన సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది. రాజధాని అమరావతి తో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోంది కేంద్రం. ఇటువంటి తరుణంలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈనెల 8న ప్రధాని విశాఖ రానున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే విశాఖపట్నంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రధాని పర్యటన ఏపీ భవిష్యత్ నే మార్చేస్తోంది అని టాక్ వినిపిస్తోంది.

    * షెడ్యూల్ ఖరారు
    ప్రధాని మోదీ ఈనెల 8న విశాఖలో పర్యటించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు విశాఖ నగరంలోని గడపనున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం లో ఎన్టీపీసీ నిర్మించనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తారు. రైల్వే తో పాటు జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే కార్యక్రమాలను సైతం సభా వేదిక నుంచి చేపడతారు. ప్రధాని పర్యటనకు ముందే సీఎం చంద్రబాబు విశాఖకు వస్తున్నారు. ఈ నెల 4న నిర్వహించనున్న నేవీ డే పరేడ్ కు సీఎం హాజరుకానున్నారు. ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమాల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కూడా పాల్గొంటారు. వారిద్దరూ మాట్లాడిన తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఏపీకి సంబంధించి పలు విషయాలను వెల్లడించునున్నారు.

    * కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం
    కేంద్రం ఈసారి ఏపీ విషయంలో సానుకూలంగా ఉంది. అమరావతి నుంచి కొత్తగా రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. అటు జాతీయ రహదారుల విషయంలోనూ ప్రాధాన్యమిచ్చింది. కొత్తగా ఏపీకి పరిశ్రమల ఏర్పాటులోనూ కేంద్రం సహకారం అందిస్తోంది. అయితే ప్రధాని విశాఖ పర్యటనలో భాగంగా ఏపీకి సంబంధించి వరాలు ప్రకటిస్తారని సమాచారం. కీలకమైన చాలా అంశాలకు సంబంధించి నిధుల ప్రకటన, ఏపీ భవిష్యత్తుకు సంబంధించిన హామీలు సైతం ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో ప్రధాని మోడీ విశాఖపట్నం