https://oktelugu.com/

Perni Nani: పవన్ కు భయపడిన పేర్ని నాని

ఈసారి తాను ఎన్నికల నుంచి తప్పుకుంటానని.. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని పేర్ని నాని ఎప్పటినుంచో జగన్ ను కోరుతూ వచ్చారు. అయితే జగన్ కు ఇష్టం లేకపోయినా.. నాని కోరడంతో అనివార్య పరిస్థితిలో కిట్టుకు జగన్ చాన్స్ ఇచ్చారు.

Written By:
  • Dharma
  • , Updated On : April 27, 2024 / 10:21 AM IST

    Perni Nani

    Follow us on

    Perni Nani: వైసీపీ ఫైర్ బ్రాండ్లలో పేర్ని నాని ఒకరు. ఈసారి పోటీ నుంచి తప్పుకున్న ఆయన కుమారుడు కిట్టుకు అవకాశం ఇచ్చారు. మచిలీపట్నంలో కుమారుడ్ని గెలిపించే పనిలో ఉన్నారు. అయితే ఈసారి అక్కడ గెలుపు అంత ఈజీ కాదు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు జనసేన అదనపు బలం కానుంది.అయితే ఈ తరుణంలో పవన్ అభిమానులకు కూల్ చేసేందుకు పేర్ని నాని రంగంలోకి దిగారు. గతంలో తాను పవన్ పై చేసిన వ్యాఖ్యల గురించి.. దాని వెనుక జరిగిన కథ గురించి తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తనకు పవన్ అంటే కోపం లేదని.. కేవలం పవన్ విధానాలను మాత్రమే వ్యతిరేకించానని కాస్త తగ్గి పేర్ని నాని మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    ఈసారి తాను ఎన్నికల నుంచి తప్పుకుంటానని.. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని పేర్ని నాని ఎప్పటినుంచో జగన్ ను కోరుతూ వచ్చారు. అయితే జగన్ కు ఇష్టం లేకపోయినా.. నాని కోరడంతో అనివార్య పరిస్థితిలో కిట్టుకు జగన్ చాన్స్ ఇచ్చారు. అయితే నాని మంత్రిగా ఉన్న సమయంలో కుమారుడు కిట్టు రెచ్చిపోయారు. మచిలీపట్నంలో ఎన్నో వివాదాలకు కారణమయ్యారు. మరోవైపు పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేయడంలో పేర్ని నాని ముందుండేవారు. ఒకానొక దశలో పవన్ కే పేర్ని నాని చెప్పు చూపించేదాకా పరిస్థితి వచ్చింది. అందుకే రాష్ట్రస్థాయిలో జనసైనికులకు పేర్ని నాని అంటే విపరీతమైన కోపం. మచిలీపట్నంలో కాపు సామాజిక వర్గం కూడా అధికం. ఈ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం నుంచి ఇబ్బందులు వస్తాయని పేర్ని నానికి తెలుసు. అందుకే ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో పవన్ విషయంలో పేర్ని నాని మాట్లాడిన తీరు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది.

    పవన్ అంటే నాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం లేదని… ఆయన భార్య గురించి తాను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని పేర్ని నాని తెలిపారు. ఆయన మూడు పెళ్లిళ్ల గురించి మాత్రమే స్పందించానని.. అంతకుమించి ఏమీ మాట్లాడలేదు అన్నారు. ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెడితే పార్టీ సిద్ధాంతాల కోసం పాటుపడాలే కానీ… చంద్రబాబు కోసం పవన్ పార్టీ పెట్టడం దారుణ చర్యగా నాని అభివర్ణించారు.చంద్రబాబును రాజకీయంగా కాపాడేందుకు పవన్ పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. చిరంజీవి కంటే చంద్రబాబు అంటేనే పవన్ కళ్యాణ్ కు ఇష్టమని పేర్ని నాని పేర్కొన్నారు. పవన్ ను నేనెప్పుడూ కాపు అని తిట్టలేదని.. పవన్ తరుణ్ తిట్టిన తర్వాతే తాను స్పందించిన విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు కాపులు పవన్ వెంట లేరని.. జగన్ వెంట మెజారిటీ కాపులు ఉన్నారని పేర్ని నాని ప్రస్తావించడం విశేషం.

    అయితే ఒక వైపు నాని భయపడుతున్నట్టు కనిపించారు. మరోవైపు పవన్ పై పరోక్ష విమర్శలు చేశారు. మచిలీపట్నంలో పేర్ని కిట్టుకు ఆశించిన స్థాయిలో పరిస్థితి లేదు. అక్కడ కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర పట్టు బిగిస్తున్నారు. ఇక్కడ కాపులు సైతం కూటమి వైపు టర్న్ అయ్యారు. కిట్టుప్రచారానికి పెద్దగా స్పందన కూడా రావడం లేదు. దీంతో పేర్ని నాని పునరాలోచనలో పడిపోయారు. అందుకే ప్రత్యేక టివి ఇంటర్వ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే చంద్రబాబు పల్లకిని పవన్ మోస్తున్నారని.. అంతకుమించి పవన్ పై తమకు కోపం లేదని పేర్ని నాని చెప్పడం విశేషం.