MP Midhun Reddy: పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బిజెపి గ్రీన్ సిగ్నల్.. కేంద్రమంత్రి పదవి ఆఫర్ చేశారట!

రాజకీయాల్లో అవసరాలు పనిచేస్తాయి. 2019 నుంచి 24 మధ్య చంద్రబాబు అంటే అవసరం లేదు బిజెపికి. ఇప్పుడు అదే చంద్రబాబు రాజకీయంగా బలపడేసరికి అవసరమయ్యారు.

Written By: Dharma, Updated On : August 12, 2024 9:59 am

Mp midhunreddy

Follow us on

Mp midhunreddy: వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి బిజెపిలో చేరుతున్నారా? ఆ మేరకు సంకేతాలు పంపుతున్నారా? కేసులు చుట్టుముడుతున్న దృష్ట్యా పార్టీ మారడం తప్పదా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి. వైసిపి ఆవిర్భావం నుంచి యాక్టివ్ గా ఉన్నారు. 2014లో తొలిసారిగా రాజంపేట నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో సైతం అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.అయితే ఐదేళ్ల వైసిపి పాలనలో రాయలసీమపై పూర్తి పట్టు సాధించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ కుటుంబం చాలా దూకుడుగా ముందుకు సాగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీంతో పార్టీ మారడమే ఉత్తమమని మిధున్ రెడ్డి సైతం ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగింది. బిజెపిలోకి వెళితే కొంతవరకు కేసుల నుంచి తప్పించుకోవచ్చు అని.. తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైతం బిజెపిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడిచింది. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామ్యం అయినందున.. అది సాధ్యం కాలేదని సమాచారం. మిధున్ రెడ్డి ప్రయత్నాలు వర్కౌట్ కాకపోవడంతో పూర్తిగా వెనక్కి తగ్గిపోయినట్లు తెలుస్తోంది.

* మిధున్ రెడ్డి కామెంట్స్ వైరల్
అయితే తాజాగా మిధున్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో తనకు బిజెపి నుంచి ఆహ్వానం వచ్చిందని.. పార్టీలోకి వస్తే కేంద్రమంత్రి పదవి ఆఫర్ చేశారని గుర్తు చేశారు. అయితే అది 2019 తర్వాత కాదు. 2014లో పిలిచారట. కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేశారట. అయితే 2014 ఎన్నికల్లో బిజెపి సొంతంగానే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. పైగా అప్పుడు టిడిపి కీలక భాగస్వామి. మరి మిధున్ రెడ్డికి ఎలా పిలిచారో అర్థం కావడం లేదు. ఎందుకు పిలిచారో కూడా తెలియడం లేదు.

* కొత్త సంకేతాలు
అయితే తాజాగా మిధున్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే.. బిజెపికి సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాత కేసులు తిరగదోడుతున్నారు. దీంతో జగన్ సైతం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వీలైనంతవరకు బిజెపికి కోపం రాకుండా చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే మిధున్ రెడ్డిని ప్రయోగించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నందున.. బిజెపి కూడా పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.

* కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకుంటారు
ఈసారి మిధున్ రెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పై గెలిచారు. పొత్తులో భాగంగా రాజంపేట సీటును బిజెపికి కేటాయించారు. బిజెపి కిరణ్ కుమార్ రెడ్డి ని అభ్యర్థిగా దించింది. గతం కంటే మెజారిటీ తగ్గింది. అయినా సరే మిధున్ రెడ్డి గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి సైతం బిజెపిలో యాక్టివ్ అవుతున్నారు. ఆయన పెద్దిరెడ్డి కుటుంబానికి చిరకాల ప్రత్యర్థి. ఎట్టి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బిజెపిలో చేరికను అడ్డుకుంటారు. ఇన్ని పరిణామాల నడుమ బిజెపి మిధున్ రెడ్డి ని ఆహ్వానిస్తుందంటే ఒట్టి మాటే. ఇదంతా మైండ్ గేమ్ గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.