Pawan Varahi Vijaya Yatra : కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనసేన ‘వారాహి’ యాత్ర నేడు కాకినాడ ప్రాంతంలోని పత్తిపాడు సభతో ప్రారంభమైంది. ఈ సభకి పవన్ కళ్యాణ్ అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. అడుగడుగునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. జాతీయ రహదారులు సైతం జన సందోహంతో బ్లాక్ అయిపోయాయి. ఇంత జనసందోహాన్ని ముందుగానే ఊహించారు కానీ, ఈ స్థాయిలో వస్తారని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు.
ఈ సభకి దాదాపుగా లక్ష మందికి పైగా అభిమానులు హాజరయ్యారని అంటున్నారు విశ్లేషకులు. ఇక అభిమానులను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అయన ప్రసంగం ప్రారంభిస్తూ ‘కర్ణుడు కవచ కుండరాలతో జన్మిస్తే,నేను మీ అభిమానంతో జన్మించాను. జయాపజయాలకు అతీతంగా నన్ను ఇంతలా అభిమానిస్తున్న మీ అందరికీ ఏమి ఇచ్చి నా ఋణం తీర్చుకోగలను’ అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఓడించడానికి ఎన్ని కుట్రలు జరిపారో నాకు మొత్తం తెలుసు. భీమవరంలో లక్ష ఓట్లు ఉంటే, లక్ష 8 వేల ఓట్లు పోల్ అయ్యాయి. కేవలం ఆ ఒక్క ప్రాంతం నుండే నన్ను ఓడించడానికి 300 కోట్లు ఖర్చు చేసారు. ఈసారి ఎన్ని కుట్రలు చెయ్యాలో చెయ్యండి. ఎన్ని వేషాలు వేస్తారో వెయ్యండి, జనసేన పార్టీని అసెంబ్లీకి రానివ్వకుండా ఎలా ఆపుతారో మేము కూడా చూస్తాము’ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించింది.
https://www.youtube.com/watch?v=e-LHFpIG0Hw
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మాటికొస్తే నన్ను ఒంటరిగా రమ్మని అంటారు. ఒంటరిగా రావాలో, కూటమిగా రావాలో నేను ఇంకా నిర్ణయించుకోలేదు. కానీ అసెంబ్లీ లో అడుగుపెట్టి తీరుతాము’ అని శపథం చేశాడు పవన్ కళ్యాణ్. ఆయన స్పీచ్ జనసేన క్యాడర్ లో మంచి జోష్ ని నింపింది.
This time we’re stepping into the Legislative Assembly #VarahiVijayaYatra pic.twitter.com/WAY5YX1OL3
— Pawanfied (@Only_PSPK) June 14, 2023