pawank
Pawan Kalyan : చంద్రబాబు అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమైంది. రాజకీయ ప్రకంపనలు పుట్టించింది. చంద్రబాబు అరెస్టు అక్రమమని విపక్ష నాయకులు ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అర్ధరాత్రి అరెస్టులు ఏమిటని జనసేన అధినేత పవన్ ప్రశ్నించారు.ఈ ఘటనను నిరసిస్తూ పవన్ విజయవాడ వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన ప్రయత్నాలను పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు. తొలుత ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి ప్రయత్నించారు. కానీ తెలంగాణ పోలీసుల అడ్డుకున్నారు. పవన్ ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి ఇవ్వలేదు.
pawan kalyan3
దీంతో శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం గుండా విజయవాడ బయలుదేరారు. పవన్ వస్తున్నారన్న సమాచారం అందుకున్న జనసైనికులు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం గరికపాడు చెక్ పోస్ట్ వద్దకు పవన్ కాన్వాయ్ చేరుకునేసరికి అర్ధరాత్రి పట్టింది. కానీ అక్కడ ఏపీ పోలీసులు భారీగా మోహరించారు. పవన్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో చాలాసేపు గందరగోళం నెలకొంది. అయితే అప్పటికే జనసైనికులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి అవుతున్నా తరగని అభిమానంతో వేచి ఉండడం కనిపించింది. పోలీసులు పవన్ ను అడ్డుకోవడంతో జనసైనికులు కోపోద్రిక్తులయ్యారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ చర్యలకు అడ్డుగా నిలిచారు. పోలీసులు పవన్ ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పవన్ ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఎవరు ఎంతగా అడ్డుపడినా తాను మంగళగిరి కి వెళ్లకుండా ఆపలేరు అని తేల్చి చెప్పారు. కారు దిగి కాలినడకన వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అప్పటికి పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు. తనను మంగళగిరి వెళ్లనిచ్చేంత వరకు కదిలేదే లేదని భీష్మించుకుని కూర్చున్నారు.దీంతో పోలీసులు అతి కష్టం మీద పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ ను అరెస్టు చేశారు. జీప్ లో ఎక్కించారు. కానీ ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదు.
అయితే ఈ హఠాత్పరిణామంతో జనసైనికులు, అభిమానులు ఆందోళన గురయ్యారు. పవన్,మనోహర్ లను ఎక్కించిన వాహనానికి అడ్డంగా నిలిచారు. ఏపీ ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిస్తున్నప్పటికీ జనసైనికులు వినలేదు.వాహనాన్ని కదిలించడం పోలీసులకు కష్టతరంగా మారింది.ఒకానొక దశలో జనసైనికులపై పోలీసులు లాఠీచార్జికి దిగారు. అయితే ఈ ఘటనతో జనసైనికుల్లో ఉన్న పోరాట పటిమ బయటపడింది.అర్థరాత్రి కూడా తరగని అభిమాన సందోహం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కున్న అభిమానగణం మరి ఎవరికీ లేదన్నట్టు పరిస్థితి తెలియజేసింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyans visit to the crowd at midnight
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com