Vijayasai Reddy
AP BJP : ఏపీ ( Andhra Pradesh)విషయంలో బిజెపి శరవేగంగా పావులు కదుపుతోంది. ఇటీవల రాష్ట్రానికి ప్రధాని మోదీ తో పాటు హోం మంత్రి అమిత్ షా వచ్చి వెళ్లారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. అదే సమయంలో ఏపీలో కూటమి.. జాతీయస్థాయిలో ఎన్డీఏ బలోపేతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ తరుణంలోనే వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. దీనిపై వైసీపీ అధినేత జగన్ నోరు తెరవలేదు. విజయసాయి రెడ్డి వెనుక బిజెపి హస్తము ఉందన్న అనుమానాలు ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ కు పిలుపు వచ్చింది. విజయసాయిరెడ్డి తో పాటు మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం విశేషం.
* ఏపీ పట్ల ఉదారత
ఏపీకి కేంద్రం( central government) ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. కేంద్రం పట్ల ఏపీలో సానుకూలత రావాలంటే టిడిపి తో పాటు జనసేన అవసరం ఉంది. అదే సమయంలో బిజెపికి సైతం బలమైన నాయకత్వం అవసరం. వైసీపీ రాజ్యసభ సభ్యులను రాజీనామా చేయించి.. ఆ ఖాళీలను బిజెపి సొంతం చేసుకోవాలని చూస్తోంది. తద్వారా వైసిపిని దెబ్బతీయడంతో పాటు బిజెపి బలం పెంచుకోవచ్చు అన్నది ఆలోచన. ఇదే విషయంపై టిడిపి అధినేత చంద్రబాబుతో కేంద్ర పెద్దలు చర్చించారు కూడా. అందుకు ఆయన అంగీకరించిన తర్వాతే బిజెపి ప్లాన్ ప్రారంభమైనట్లు సమాచారం. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి వైసీపీని వీడారని తెలుస్తోంది. ఇంకోవైపు మరో ఇద్దరు వైసిపి రాజ్యసభ సభ్యులు సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* జగన్ సైలెంట్ విజయసాయిరెడ్డి( Vijaya Sai) ఎపిసోడ్ వెనుక బిజెపి ఉందన్న అనుమానాలు ఉన్నాయి. సాయి రెడ్డి రాజీనామా పై జగన్ ఇంతవరకు మాట్లాడలేదు. వైసీపీ నేతలు ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. దీంతో బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును మెగాస్టార్ చిరంజీవితో భర్తీ చేయాలన్న ఆలోచనలు బిజెపి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. గతంలో చిరంజీవి రాజ్యసభకు వెళ్తారని ప్రచారం ఉండేది. దానిని చాలాసార్లు మెగాస్టార్ ఖండించారు. కానీ ఇటీవల బిజెపి పెద్దలతో చిరంజీవి సన్నిహితంగా మెలుగుతున్నారు. తప్పకుండా కేంద్రంలో మెగాస్టార్ కు మంచి పదవి ఇస్తారని ఒక ప్రచారం అయితే ఉంది. ఇప్పుడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్ ని పిలిచి చిరంజీవికి రాజ్యసభ ఇస్తామని ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది.
* చిరంజీవి విషయంలో అలా
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి ( megastar Chiranjeevi)ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. కానీ కూటమికి పరోక్ష మద్దతు తెలుపుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు రాజ్యసభ పదవి ఇస్తే ఆయనపై పార్టీ ముద్రపడే అవకాశం ఉంది. అయితే చిరంజీవికి రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా.. ఏపీలో కాపుల్లో సానుకూలత లభిస్తుందన్నది బిజెపి ఆరాటం. ఏపీలో కూటమి కూడా బలపడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కేంద్ర పెద్దలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ను ఢిల్లీకి పిలిచి అదే విషయం చెప్పబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఏపీలో అసలు సిసలు గేమ్ మొదలుపెట్టింది బిజెపి. విజయసాయిరెడ్డి రాజీనామాతో ప్రారంభమైన ఆట ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyan went to delhi in the wake of vijaya sai reddys resignation
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com