Pawan Kalyan shocking look: గబ్బర్ సింగ్( Gabbar Singh).. సర్దార్ గబ్బర్ సింగ్.. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. సూపర్ హిట్ చిత్రాలుగా విజయం సాధించాయి. అయితే ఆ సినిమాలు టైటిల్ వరకే కానీ ఎక్కడ సింగ్ గా కనిపించలేదు పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు నిజజీవితంలో సింగ్ గా మారి కనిపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన వస్త్రధారణ, వేషధారణ ఎవరు గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. సాధారణంగా సిక్కులు టర్బైన్ ధరించి సంప్రదాయబద్ధంగా కనిపిస్తారు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా అదే మాదిరిగా కనిపించేసరికి అభిమానులు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ చేశారు.
మహారాష్ట్రలో పర్యటన..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) మహారాష్ట్రలో పర్యటించారు. సీఎం దేవేంద్ర పద్నవిస్ తో కలిసి.. నాందేడ్ లోని గురుద్వారా కి వెళ్లారు. సిక్కుల 10వ మత గురువు గురు గోవింద్ సింగ్ సాయిబాబా సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటైన గురుద్వారా హుజూర్ సహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. గురుద్వారా ప్రముఖుల చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ కు సంప్రదాయ సిగ్గు తలపాగాను ధరించారు. పవన్ కళ్యాణ్ సాదర్ ను సమర్పించి నమస్కరించారు.
ఎగబడిన అభిమానులు..
అయితే సిక్కు సంప్రదాయ వస్త్రధారణతో ఎవరు గుర్తించలేని విధంగా మారిపోయారు పవన్ కళ్యాణ్. చాలా అందంగా కూడా కనిపించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సైతం పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు ఎగబడటం కనిపించింది. పవన్ కళ్యాణ్ తో వారు ఫోటోలకు దిగారు. ఆటోగ్రాఫ్ లు తీసుకున్నారు. మరోవైపు సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో సందర్శించారు. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలపై దృష్టి పెట్టినట్లు స్పష్టం అవుతోంది..
http://youtube.com/post/UgkxpUb7pzMpvFMeDsN6jGXN5z_BVW6kFK1a?si=41XOINqJJHW2grPc