https://oktelugu.com/

Pawan Kalyan: కూతురుతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ..కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో అద్భుత ఘట్టం!

గడిచిన రెండు నెలల్లో అకిరా పవన్ కళ్యాణ్ తో కలిసి తిరగడం మనం బాగా చూసాము. ఇప్పుడు కూతురు ఆద్య కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. నేషనల్ స్పేస్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ శ్రీహరి కోట కి విచ్చేసి, ఉత్తేజభరితమైన ప్రసంగం అందించిన సంగతి మన అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : August 15, 2024 / 03:42 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సాధారణంగా ఇంతకు ముందు తన పిల్లలను మీడియా కి ఎక్కువ చూపించేవాడు కాదు. అకిరా నందన్, ఆద్యతో కలిసి దిగిన వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియా లో మనం ఎన్నోసార్లు చూసాము కానీ, వాళ్ళను మీడియా ముందుకు తీసుకొని రావడం మాత్రం అంతకు ముందు ఎన్నడూ జరగలేదు. కానీ ఆయన ఈ సార్వత్రిక ఎన్నికలలో సంచలన విజయం సాధించి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పెద్ద కొడుకు అకిరా నందన్ ని తనతో పాటు ఎలా తిప్పాడో మన కళ్లారా చూసాము. ఏకంగా ఢిల్లీ కి తనతో పాటు తీసుకెళ్లి ప్రధాన మంత్రి మోడీ కి పరిచయం చేసాడు. అలాగే ప్రమాణస్వీకారం చేసేరోజు అకిరా, ఆద్య ఇద్దరూ కూడా మోడీని కలిశారు.

    గడిచిన రెండు నెలల్లో అకిరా పవన్ కళ్యాణ్ తో కలిసి తిరగడం మనం బాగా చూసాము. ఇప్పుడు కూతురు ఆద్య కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. నేషనల్ స్పేస్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ శ్రీహరి కోట కి విచ్చేసి, ఉత్తేజభరితమైన ప్రసంగం అందించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక్కడికి ఆద్య పవన్ కళ్యాణ్ తో కలిసి వచ్చింది. ఇక నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు అయ్యాడు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమానికి ఆద్య కూడా వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన తండ్రితో కలిసి సెల్ఫీ తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఆద్య ని ఇంత దగ్గరగా అభిమానులు ఆమె చిన్నతనం లో ఉన్నప్పుడు చూసారు. పెద్దయ్యాక కూడా చూసారు కానీ, ఇంత క్లారిటీ తో ఆమె ఒక్క ఫొటోలో కూడా కనపడలేదు. తన తండ్రిని ఉపముఖ్యమంత్రి హోదాలో జెండా ఎగరవేయడాన్ని చూసి ఆమె ఎంతగానో మురిసిపోయింది. ఇక అభిమానులు కూడా ఈరోజు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న పవన్ కళ్యాణ్ – ఆద్య సెల్ఫీ ని చూసి అచ్చు గుద్దినట్టు నాన్న పోలికలతో ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    ఇకపోతే పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యాక ఎంత బిజీ గా గడుపుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. నిత్యం ప్రజల సమస్యలను వింటూ, తాను చెయ్యాల్సిన సినిమాలను కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టాడు. అయితే అవి ఎప్పటికైనా పూర్తి చెయ్యాల్సిన సినిమాలు కాబట్టి, అక్టోబర్ నెలలో ముందుగా ఓజీ చిత్రాన్ని పూర్తి చేయనున్నాడు. 70 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి, పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల సమయం ఇస్తే సరిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారని సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరిగింది. దీనిపై మేకర్స్ స్పందిస్తూ అలాంటిదేమి లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు.