Pawan Kalyan house controversy: గత కొద్దిరోజులుగా తెలంగాణ లో పవన్ కళ్యాణ్ పై జరుగుతున్నా ముప్పేట దాడి ని మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ప్రొఫెస్సర్ నాగేశ్వర రావు, ఎలాంటి ఆధారాలు లేకుండా, సోషల్ మీడియా లో వైసీపీ పార్టీ నాయకులూ ప్రచారం చేసే వార్తలను తీసుకొచ్చి , పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో రీసెంట్ గా అమిత్ షా ని కలవడానికి వెళ్ళడానికి ముఖ్య కారణం జగన్ ని అరెస్ట్ చెయ్యమని అడగడానికి అని చెప్పడం , అందుకు అమిత్ షా పవన్ కళ్యాణ్ ని మందలించి పంపాడని అనడం, వీటిని జనసేన పార్టీ చాలా తీవ్రస్థాయిలో ఖండించడం వంటివి జరిగాయి. ఈ సమస్యని మరింత తీవ్రవతం చేస్తూ ప్రొఫెస్సర్ నాగేశ్వర్ రావు తన తోటి జర్నలిస్టులతో కలిసి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి తెలంగాణ వాదం లేవనెత్తడం వంటివి చేయడం రాజకీయాల్లో తీవ్రమైన హీట్ వాతావరణం ని తలపించాయి.
ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ నవనిర్మాణ సభ ని ఏర్పాటు చేసాడు. 2 వేలమంది జనసేన కార్యకర్తలతో గచ్చిబౌలి లో ప్లాన్ చేసిన ఈ మీటింగ్ కి ప్రభుత్వం నుండి అనుమతి రాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి వద్దనే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేస్తున్నట్టు నేడు ఉదయం ఒక ప్రకటన చేసాడు. కాసేపటి క్రితమే ఈ ప్రెస్ మీట్ ని నిర్వహించగా, పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కీలమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ లో నన్ను అడుగుపెట్టనివ్వం అని కొందరు కాంగ్రెస్ నాయకులూ మాట్లాడుతున్నారు. తెలంగాణ మీ అయ్యా జాగీరు అనుకుంటున్నారా?, ఇప్పుడు చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి , తెలంగాణ లో జనసేన పార్టీ ఉంటుంది , ప్రతీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది , ప్రతీ సమస్య పై గొంతెత్తి మాట్లాడుతుంది, ఏమి చేస్తారో చేసుకోండి’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘కొంతమంది నేను తెలంగాణ లో భూమి ని కబ్జా చేసి ఇల్లు ని నిర్మించుకున్నానని అంటున్నారు. నేను నిజంగా అలా చేసానని నిరూపిస్తే , రేవంత్ గారికి ఒక్కటే చెప్తున్న, నా ఇల్లు ని తెలంగాణ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా రాసి ఇచ్చేస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడానికి కానీ, విభజన కి కానీ నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు , విభజించిన తీరుకి వ్యతిరేకం అని మొదటి నుండి చెప్తూనే వస్తున్నామని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా, యువత కి ఉపాధి కలిపించలేక పోయారని , ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పిన వాళ్ళు నేడు కాంగ్రెస్ పార్టీ లో ఎమ్మెల్యే లుగా కొనసాగుతున్నారని , ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు నా మీద మాట్లాడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నెటిజెన్స్ అమితంగా ఆకట్టుకున్నాయి . అంతే కాకుండా గద్దర్ తో తనకు ఉన్నటువంటి గొప్ప అనుబంధాన్ని , ఆయన ఉద్యమ స్ఫూర్తిని కూడా పవన్ కళ్యాణ్ ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడడం గమనార్హం. ఇంకా ఆయన ఈ ప్రెస్ మీట్ లో ఏమేమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.

