https://oktelugu.com/

Pawan Kalyan vs Perni Nani : గుడిలో నా రెండు చెప్పులు కొట్టేసారు.. నా చెప్పులు నాకు ఇవ్వండి అంటూ పేర్ని నానిపై సెటైర్స్ వేసిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ సీరియస్ గా కాకుండా, వ్యంగ్యంగా స్పందించి , పేర్ని నాని కి కౌంటర్ ఇవ్వడాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 17, 2023 / 08:26 AM IST
    Follow us on

    Pawan Kalyan vs Perni Nani : పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ అధికార వైసీపీ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ముందుకు కొనసాగుతుంది. నిజాలను నిక్కచ్చిగా బయటపెడుతు, వైసీపీ పార్టీ చేస్తున్న దురాగతాలను ఎత్తి చూపుతూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగం స్టైల్ ని మొత్తం మార్చేసి అభిమానులు మరియు కార్యకర్తలకు మాత్రమే కాకుండా , మద్యస్తం గా ఉండే జనాలకు కూడా తెగ నచ్చేసింది.

    రోజు రోజుకి వారాహి యాత్రని చూసే వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇంతకు ముందు యూత్ మాత్రమే చూసేవాళ్ళు, ఇప్పుడు మధ్యవయస్సు ఉన్నవాళ్లు, పెద్దలు కూడా చూస్తున్నారు. ఈ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగాలు జనాల్లోకి వెళ్తున్నాయి. ఇక మొన్న జరిగిన కత్తిపూడి వారాహి యాత్ర సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం కి మాజీ మంత్రి పేర్ని నాని తన రెండు చెప్పులను పవన్ కళ్యాణ్ కి మీడియా ముందు చూపిస్తూ అవమానిస్తాడు.

    పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు .. కార్యకర్తలు పేర్ని నాని దిష్టి బొమ్మలను దగ్ధం చేసి , అతని దిష్టి బొమ్మని చెప్పులతో కొట్టారు.

    ఇక నిన్న జరిగిన పిఠాపురం సభలో కూడా పవన్ కళ్యాణ్ ఈ విషయం పై స్పందిస్తూ ‘ఈమధ్య అన్నవరం లో నేను ఇష్టం తో కొనుక్కున్న రెండు చెప్పులు దొంగలింపబడ్డాయి, అవి ఎక్కడ ఉన్నాయో వెతికిస్తారా, వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారి పోయిందంటే చివరికి గుడి బయట ఉన్న చెప్పులను కూడా దొంగలించేస్తున్నారు’ అంటూ పవన్ కళ్యాణ్ వ్యంగ్యం గా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. దీనిపై పవన్ కళ్యాణ్ సీరియస్ గా కాకుండా, వ్యంగ్యంగా స్పందించి , పేర్ని నాని కి కౌంటర్ ఇవ్వడాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.