Pawan Kalyan : ఏపీలో గ్రీన్ టాక్స్( green tax) తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్ననే జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏడాదికి 20వేల రూపాయల వరకు గ్రీన్ టాక్స్ చెల్లించాల్సి వచ్చేది. అయితే దానిని పూర్తిగా తగ్గించింది కూటమి ప్రభుత్వం. మూడు వేల రూపాయల వరకు అది తగ్గనుంది. ఈ నిర్ణయం పై లారీ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టినప్పుడు లారీ డ్రైవర్లు ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీపై దృష్టి పెడతామని పవన్ కళ్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు గ్రీన్ టాక్స్ తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ సైతం ఆమోదం ముద్ర వేసింది. దీనిపై రవాణా శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇది అమలయితే లారీ యజమానులపై భారీగా భారం తగ్గనుంది.
Also Read : ఆ రెండు జిల్లాల్లో కూటమి పరిస్థితి ఇలా.. సంచలన సర్వే
* వారాహి యాత్ర సమయంలో..
2024 ఎన్నికల కు ముందు పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) వారాహి యాత్ర చేపట్టారు. అందులో భాగంగా పర్యటిస్తున్న సమయంలో ఓ లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చారు. ఏపీలో గ్రీన్ టాక్స్ వసూలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో రూ.200, తెలంగాణలో రూ.500 గా ఉంటే.. ఏపీలో మాత్రం రూ.6000 వసూలు చేస్తున్నారని వాపోయారు. ఈ విషయం గమనించిన పవన్ కళ్యాణ్ చలించిపోయారు. తాము అధికారంలోకి వస్తే గ్రీన్ టాక్స్ తగ్గిస్తామని పవన్ కళ్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
* ఎన్నికల మేనిఫెస్టోలో సైతం..
అయితే గ్రీన్ టాక్స్ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో( election manifesto ) పొందుపరిచారు పవన్ కళ్యాణ్. ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకున్నారు. మంగళవారం జరిగిన ఏపీ క్యాబినెట్లో గ్రీన్ టాక్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. లారీలతో పాటు ట్రక్కుల వంటి రవాణా వాహనదారులకు ఊరట కలిగిస్తూ.. గ్రీన్ టాక్స్ ను ఘననీయంగా తగ్గించింది. ఇప్పటివరకు ఏడాదికి గరిష్టంగా 20 వేల రూపాయల వరకు గ్రీన్ టాక్స్ చెల్లిస్తూ వస్తున్నారు. ఇకపై 1500 నుంచి 3 వేల రూపాయల వరకు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.
* కొన్నేళ్ల కిందట కేంద్రం అనుమతి..
కొన్నేళ్ల కిందట కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం( central government) గ్రీన్ టాక్స్ పెంచే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించింది. దీంతో అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ టాక్స్ ను భారీగా పెంచింది. ఏడేళ్లు దాటిన వాహనాలకు గ్రీన్ టాక్స్ పేరిట బాదుడు తప్పలేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో ఆ టాక్స్ విపరీతంగా ఉంది. ఇదే విషయాన్ని సదరు లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ కు విన్నవించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ గ్రీన్ టాక్స్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై లారీ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Remember, a lorry driver expressed his anguish to @PawanKalyan garu about AP govt collecting Green tax of Rs.6600 six months back. This is now added into Manifesto.
A true Leader#HelloAP_VoteForJanaSenaTDPBJP #HelloAP_ByByeYCP pic.twitter.com/qWNbAPGd8M
— Kumar (Pawan and Modi Ka Parivar) (@JSPWorks) May 3, 2024