Pawan Counter to Lokesh: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. 2024 జూన్ లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే సుపరిపాలన అందిస్తున్నామని.. గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూ సరైన పాలన అందిస్తున్నామని చెబుతోంది కూటమి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చక్కటి సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. అందుకే 2029 ఎన్నికల్లో మరోసారి కూటమికి ప్రజలు చాన్స్ ఇస్తారని బలంగా నమ్ముతున్నారు. ఇదే విషయంపై మాట్లాడిన నారా లోకేష్.. కూటమి విషయంలో పవన్ కళ్యాణ్ తనకు ఒక విషయం చెప్పారని బయటపెట్టారు.
లోకేష్ కామెంట్స్..
తాజాగా నారా లోకేష్( Minister Nara Lokesh ) తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. ఇటీవల ఆయన టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన సంగతి తెలిసిందే. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఆయనకు ప్రమోషన్ లభించింది. ఏకంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. అంటే తెలుగుదేశం పార్టీకి ఆయన సారధి అన్నమాట. ఇప్పటికే టిడిపిలో లోకేష్ పట్టు పెరిగింది. ఈ నియామకంతో భావి నాయకుడు లోకేష్ అని తేల్చేశారు చంద్రబాబు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన లోకేష్ కు పవన్ కళ్యాణ్ సైతం అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ రాణించాలని ఆకాంక్షించారు. కూటమి సమన్వయానికి మరింత కృషి చేయాలని కూడా పిలుపునిచ్చారు. అయితే దానిపై స్పందించిన లోకేష్ పవన్ విషయంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మూడుసార్లు వస్తామని చెప్పాల్సింది..
మంత్రి నారా లోకేష్ ఆ మధ్యన ఢిల్లీలో జరిగిన ఒక కాంక్లేవులో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇండియా టుడే ( India today)ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూ ఫేస్ చేశారు. ఈ క్రమంలో 2029 ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందని యాంకర్ అడుగగా.. మరో మాట చెప్పకుండా మరోసారి కూటమి వస్తుందని.. తమ ప్రభుత్వ విధానాలతో పాటు పాలసీలను వివరించే ప్రయత్నం చేశారు లోకేష్. ఈ క్రమంలో 2029 ఎన్నికల్లో తమదే గెలుపు అని ధీమాతో అన్నారు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ లోకేష్ కు ఫోన్ చేశారట. ఒక్క 2029 మాత్రమే కాదు.. వరుసగా మూడుసార్లు మనమే గెలుస్తాం అని చెప్పి ఉండాల్సింది అంటూ లోకేష్ తో పవన్ అన్నారట. ఇప్పుడు అదే మాట లోకేష్ చెప్పేసరికి.. సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. కూటమి దెబ్బకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అబ్బ అనాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.