Homeఆంధ్రప్రదేశ్‌Janasena Varahi Yatra 4th Phase : 100 మందికి పైగా కౌరవులు మీరు.. జగన్...

Janasena Varahi Yatra 4th Phase : 100 మందికి పైగా కౌరవులు మీరు.. జగన్ బ్యాచ్ కు పవన్ ఇచ్చిన పంచ్ లు ఇవీ

Janasena Varahi Yatra 4th Phase : కృష్ణాజిల్లా అవనిగడ్డ జనసంద్రంగా మారింది. మూడో విడత వారాహి యాత్ర ప్రారంభమైంది. వస్తూ వస్తూనే పవన్ జగన్ పై విరుచుకుపడ్డారు. పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. అమరావతి లోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదివారం సాయంత్రం అవనిగడ్డ చేరుకున్న పవన్ యాత్ర ప్రారంభించారు. టిడిపి తో పొత్తు ఉంటుందని ప్రకటన చేసిన తర్వాత జరుగుతున్న యాత్ర కావడంతో అందరిలోనూ ఒకటే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వారాహి యాత్రలో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం పార్టీ శ్రేణులకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో యాత్రలో జనసేన తో పాటు టిడిపి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నాయి.

పవన్ ఉత్సాహంగా ప్రసంగించారు. నేరుగా సీఎం జగన్ పైనే విమర్శలను ఎక్కుపెట్టారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి పవన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. అటు నుంచి బయటకు వచ్చిన తర్వాత పొత్తు ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే నడుస్తాయని ప్రకటించారు. బిజెపి కలిసి వస్తే కలుపుకొని పోతామని కూడా స్పష్టం చేశారు. ఇటువంటి తరుణంలో వారాహి మూడో విడత యాత్రపై హై టెన్షన్ నెలకొంది. జగన్ సర్కార్ పై పవన్ తప్పకుండా టార్గెట్ చేస్తారని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే పవన్ విరుచుకుపడ్డారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమని పవన్ తేల్చి చెప్పారు. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధంతో పోల్చారు. మేం పాండవులు.. మీరు కౌరవులు.. మీ ఓటమి ఖాయమని తేల్చేశారు. తప్పకుండా మేము అధికారంలోకి వస్తామని ప్రకటించారు. అన్ని వర్గాలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఉద్యోగ భర్తీని చేపట్టి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అన్నది ఉండకుండా చేస్తామని చెప్పుకొచ్చారు. 30 వేల టీచర్ ఉద్యోగాలతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని అవనిగడ్డ వేదికగా ప్రకటించారు.

అయితే ఈసారి వారాహి యాత్రలో రాష్ట్రంలో ప్రధాన సమస్యలను పవన్ అజెండాగా తీసుకున్నారు. ప్రస్తుతం జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్న సంగతి తెలిసిందే. అటు ఉద్యోగ భర్తీ ప్రకటనలు లేక నిరుద్యోగ యువకులు సైతం అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలో వారి సమస్యలపై పవన్ ఫోకస్ పెట్టారు. మూడో విడత యాత్రలో చాలా సమస్యలపై పవన్ క్లారిటీ ఇవ్వనున్నారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనులపై స్పష్టమైన ప్రకటనలు చేయనున్నారు. తొలి రోజే స్పష్టమైన సంకేతాలు పంపారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version