Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్నటి వ్యాఖ్యలను వక్రీకరించారు. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడని ఆయన మాటలను ట్రోల్ చేస్తున్నారు. దీంతో వాటికి ఈరోజు క్లారిటీ ఇచ్చేశాడు పవన్ కల్యాణ్. జనసేన పార్టీ నేతలతో మంగళగిరిలో జరిగిన సమావేశంలో సీఎం పీఠం ఎవరిదన్న దానిపై కుండబద్దలు కొట్టారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రాబొయే రోజుల్లో ఎంతో ఆసక్తికరంగా మారనున్నాయి. ఇప్పుడు ప్రతీ ఒక్కరు చర్చించుకునే విషయం అసలు టీడీపీ జనసేన పార్టీలు కలుస్తుందా లేదా, కలిస్తే ప్రభుత్వాన్ని స్థాపిస్తుందా లేదా?, దీనిపైనే ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి.పవన్ కళ్యాణ్ నిన్న తూర్పు గోదావరి జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి పర్యటించాడు.
ఈ పర్యటన అనంతరం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో పొత్తు గురించి చేసిన కొన్ని కీలక కామెంట్స్ సంచలనం రేపాయి.ఆయన మాట్లాడుతూ ‘2019 ఎన్నికలలో మనకి 40 సీట్లు వచ్చి ఉంటే పవర్ షేరింగ్ గురించి బలంగా అడిగేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు’ అని అన్నాడు. దీంతో అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు, వాళ్ళని ముఖ్యమంత్రి చెయ్యడానికి నీకు ఎందుకు పార్టీ అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేసారు. అయితే ఈరోజు జరిగిన సమావేశం లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మరోసారి చర్చకి దారి తీసింది.
https://twitter.com/Only_PSPK/status/1656991226774847488?s=20
పవన్ నిన్న డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ సీఎం పీఠం పొత్తులపై స్పష్టతనిచ్చాడు. పవన్ మాట్లాడుతూ ‘తెలుగు దేశం పార్టీ నాయకులను ముఖ్యమంత్రులను చేయడానికి జనసేన పార్టీ లేదు, కచ్చితంగా పొత్తు ఉంటుంది, కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఎన్నికలలో వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకొనే ఉంటుంది. జూన్ నెల నుండి ప్రజాక్షేత్రం లోనే ఉంటాను’ అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన మాటలను పచ్చ మీడియా వాళ్లకు అనుకూలంగా ఉండేవిధంగా మార్చి ప్రచారం చేసింది. పవన్ కళ్యాణ్ ముఖ్య మంత్రి అభ్యర్థి స్థానాన్ని వదులుకున్నట్టు ప్రచారం చేసింది. దానికి ఈరోజు పవన్ నుంచి క్లారిటీ వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు ఉండబోతున్నాయి అని ప్రచారం జరగడం తో జూన్ నెల నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉంటాడని తెలుస్తుంది. చూడాలి మరి ఈ కూటమి సక్సెస్ అవుతుందా లేదా అనేది.
https://twitter.com/DigitallyGV/status/1656981509864308736?s=20