https://oktelugu.com/

Pawan Kalyan : ఎన్టీఆర్ – అల్లు అర్జున్ కి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియచేసిన పవన్ కళ్యాణ్..వైరల్ గా మారిన లేటెస్ట్ ట్వీట్స్!

గత కొంతకాలం నుండి అల్లు అర్జున్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని , వీళ్ళ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ వాతావరణం నెలకొందని, అల్లు అర్జున్ నంద్యాల కి వెళ్లినప్పటి నుండి వీళ్ళ మధ్య గ్యాప్ రోజురోజుకి పెరుగుతూ పోతుందని, ఇలా పలు రకాల కథనాలు ప్రచురితం అయ్యాయి.

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2024 / 09:36 PM IST

    Pawan Kalyan expressed special thanks to NTR-Allu Arjun

    Follow us on

    Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో ప్రస్తుతం వరదలు సృష్టించిన ఇక్కట్లు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా విజయవాడ మొత్తం వరదలో మునిగిపోయింది. అధికారులు చెప్తున్న లెక్క ప్రకారం ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు 32 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. ఇది సాధారణమైన విషయం కాదు. ప్రభుత్వ యంత్రాంగం మళ్ళీ విజయవాడ ని మామూలు స్థితికి తెచ్చే వరకు అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమం లో మన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఒకరి తర్వాత ఒకరు ఈ విపత్కర సమయంలో ఫండ్స్ ని డొనేట్ చేస్తూ తమ గొప్ప మనసుని చాటుకున్నారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి చెరో 50 లక్షల చొప్పున కోటి రూపాయిలు ప్రకటించారు. ఇక ఆయన తర్వాత వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలు, యంగ్ హీరోలతో పాటు పలువురు హీరోయిన్స్ కూడా డబ్బులు విరాళాలు అందించారు.

    అయితే నేడు పవన్ కళ్యాణ్ తన డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ కి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ నుండి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు గొప్ప మనసుతో ఈ కష్టమైన సమయంలో వైరల్ అందించినందుకు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియచేసాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షల విరాళం అందజేసిన ప్రముఖ నటులు అల్లు అర్జున్ , రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లకు హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టకాలంలో ప్రజలకు అండగా, సహాయం చేసిన మీ ఔదార్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ సహాయం ఎంతోమందికి భరోసా కల్పిస్తుంది’ అంటూ ఆయన వేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. గత కొంతకాలం నుండి అల్లు అర్జున్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని , వీళ్ళ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ వాతావరణం నెలకొందని, అల్లు అర్జున్ నంద్యాల కి వెళ్లినప్పటి నుండి వీళ్ళ మధ్య గ్యాప్ రోజురోజుకి పెరుగుతూ పోతుందని, ఇలా పలు రకాల కథనాలు ప్రచురితం అయ్యాయి.

    అయితే సెప్టెంబర్ 2 వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఆయనకీ శుభాకాంక్షలు తెలియచేయడంతో వీళ్ళ మధ్య ఎలాంటి గొడవలు లేవు అనేది స్పష్టమవుతుంది. అలాగే నేడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి అల్లు అర్జున్ కి కృతఙ్ఞతలు తెలియచేయడంతో వీళ్ళ మధ్య అసలు ఎలాంటి పొరపొచ్చాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ స్టార్ హీరోలందరి కంటే ఎక్కువగా 6 కోట్ల రూపాయిల ఫండ్స్ ని విరాళంగా ఇవ్వడం పెద్ద సంచలనం గా మారింది. దీనిపై ఆయనకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.