Pawan Kalyan Effect: ఏపీలో మరో 30 సంవత్సరాల పాటు అధికారం తనదేనంటున్న జగన్ కు అధికార పార్టీ ఎమ్మెల్యేలు షాకిస్తున్నారు. మీరు అధికారంలో కొనసాగిండి కానీ,, మేము మాత్రం పదవుల్లో కొనసాగలేమని తేల్చిచెబుతున్నారు. అధిష్టానానికి చెప్పి మరీ తమ పదవులను వదులుకుంటున్నారు. ఎంతమాత్రం ఆ పదవులు నిర్వర్తించలేమిని తెగేసి చెబుతున్నారు. దీంతో సీఎం జగన్ కు వరుస షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. కొద్దిరోజుల కిందట మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేశారు. తాజగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి నుంచి కాపు రామచంద్రారెడ్డి వైదొలిగారు. ఇద్దరు నాయకులు తమ వ్యక్తిగత సమస్యలతో పదవికి రాజీనామా చేసినట్టు అధిష్టానానికి సమాచారమందించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇలా నేతలు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తుండడంతో జగన్ కు మింగుడు పడడం లేదు.

అయితే వైసీపీ నాయకులు బయటకు వ్యక్తిగత కారణాలు చెబుతున్నప్పటికీ.. లోలోపల మాత్రం చాలా రాజకీయాలు నడుస్తున్నాయని టాక్ నడస్తోంది. మేకతోటి సుచరిత గత కొద్దిరోజులుగా ఏమంత యాక్టివ్ గా లేరు. మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయేసరికి ఆమె నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. చెప్పాపెట్టకుండా పదవి నుంచి తొలగించడంపై ఓకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచరులతో ఆందోళన కార్యక్రమాలు జరిపించారు. ప్రభుత్వ పెద్దలు చర్చలు జరపడంతో కాస్తా శాంతించారు. అయితే తాజా మాజీలందరికీ పార్టీ పగ్గాలు అప్పగించిననేపథ్యంలో సుచరితకు గుంటూరు పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయినా అయిష్టంగానే బాధ్యతలు స్వీకరించారు. ఏమంత ఆశాజనకంగా పనిచేయడం లేదు. ఇప్పుడు రాజీనామా చేశారు. సొంత నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
అటు కాపు రామచంద్రారెడ్డి సైతం అనూహ్యంగా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించారు. అందుకు వ్యక్తిగత కారణాలను చూపారు. కొద్దిరోజుల కిందట రామచంద్రారెడ్డి అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నానని.. పార్టీకి విలువైన సమయం వెచ్చించలేకపోతున్నానని అధిష్టాన పెద్దలకు చెప్పినట్టు సమాచారం. రామచంద్రారెడ్డి సీనియర్. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ తో ఉన్నారు. మంత్రి పదవిని ఆశించారు. కానీ సామాజిక సమతూకంలో ఆయనకు కేబినెట్ లోకి తీసుకోలేదు. అయితే అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న ఆయనకు పార్టీ పదవి కేటాయించారు. కానీ కంఫర్టబుల్ గా పదవి స్వీకరించలేదు. ఇప్పుడు కొద్దిరోజులకే వ్యక్తిగత కారణాలు చూపి రాజీనామా చేశారు.

రాజీనామా చేసిన ఇద్దరు నాయకులపై భిన్న వాదన వినిపిస్తోంది. ఇద్దరూ జనసేన గూటికి చేరతారన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఇప్పటికే సుచరిత జనసేన నాయకులతో టచ్ లోకి వెళ్లారని.. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారని టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి బరిలో దించేందుకువైసీపీ నాయకత్వం ప్రత్యామ్నాయం చూస్తోందన్న అనుమానం సుచరితలో ఉంది. అందుకే ఆమె సేఫ్ జోన్ వెతుకుతున్నారు. అందుకు జనసేనమంచి వేదికగా భావిస్తున్నారు. కాపు రామచంద్రారెడ్డికూడా రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారు. వైసీపీలో ఉంటే తన మంత్రి పదవి కల సాకారం కాదని భయపడుతున్నారు. అందుకే జనసేన వైపు చూస్తున్నారు. ప్రస్తుతానికి ఇద్దరు ఎమ్మెల్యేలు బయటపడ్డారు. మున్ముందు పవన్ ఎఫెక్ట్ చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రభావం చూపే అవకాశముందన్న టాక్ పొలిటికల్ సర్కిల్ లో సర్క్యులేట్ అవుతోంది.