https://oktelugu.com/

Pawan Kalyan: ఒక్క ప్రమాదం.. పవన్ మైండ్ సెట్ నే మార్చేసిందా? అందుకేనా ఈ నిర్ణయం*

గత ఐదేళ్ల వైసిపి పాలనలో రహదారులు (roads) దారుణంగా తయారయ్యాయి. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై తీవ్రంగా ఆక్షేపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP deputy CM Pawan Kalyan)

Written By:
  • Dharma
  • , Updated On : January 6, 2025 / 05:44 PM IST

    Pawan Kalyan(13)

    Follow us on

    Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( AP deputy CM Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు. గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు (game changer free release event) నుంచి వస్తు ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు పవన్. జనసేన తరఫున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ రోడ్డు నిర్వహణపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన రోడ్డును ఎవరూ పట్టించుకోలేదంటూ తప్పు పట్టారు. తాను ఇక అదే రోడ్డుపై వెళ్తానంటూ సంచలన ప్రకటన చేశారు. పవన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాజమండ్రిలో గేమ్ చేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ ( deputy CM Pawan) కార్యక్రమానికి హాజరయ్యారు. లక్షలాదిమంది మెగా అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఈవెంట్ కు హాజరై తిరిగి వెళుతున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. చిత్ర యూనిట్ (cinema unit) శరవేగంగా స్పందించింది. రామ్ చరణ్ (Ram Charan) పది లక్షల రూపాయలు చొప్పున.. నిర్మాత దిల్ రాజు 5 లక్షల రూపాయల చొప్పున సాయం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. జనసేన తరఫున ఆర్థిక సాయం ప్రకటించారు. రోడ్డు నిర్వహణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.

    * వ్యాన్ ఢీకొట్టడంతో
    కాకినాడకు చెందిన మణికంఠ, చరణ్ లు స్నేహితులు. మెగా కుటుంబానికి అభిమానులు. రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్ కు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో భాగంగా బైక్ పై బయలుదేరారు. సరిగ్గా రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో (ADB Road) కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో వీరి బైక్ను వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈవెంట్ కు హాజరై తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని తెలియడంతో చిత్ర యూనిట్ స్పందించింది. ముందుగా హీరో రామ్ చరణ్ (hero Ram Charan) స్పందించారు. మృతులకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. అటు తర్వాత దిల్ రాజు (dil raju)సైతం ఐదు లక్షల రూపాయల చొప్పున సాయం ప్రకటించారు. అయితే ఇద్దరూ యువకుల మృతికి రోడ్డు బాగోలేకపోవడమే కారణం. దీంతో దీనిపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్. ఇదంతా వైసీపీ ప్రభుత్వ పాపమేనని చెప్పుకొచ్చారు.

    * గత ఐదేళ్లుగా నిర్వహణ లేక
    కాకినాడ నుంచి రాజమహేంద్రవరం మధ్య ఏడిబీ రోడ్డు (ADB Road) ఉంటుంది. గత ఐదేళ్ల కాలంలో ఈ రహదారిని ఎవరు పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రహదారిని కూటమి ప్రభుత్వం బాగు చేసే పనిలో పడింది. ఈ దశలోనే ఈ రహదారి ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడాన్ని పవన్ కళ్యాణ్ తట్టుకోలేక పోయారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు. కనీస నిర్వహణ పనులు కూడా చేయలేదని ఆక్షేపించారు. సరైన విద్యుత్ దీపాలు (electrical lights) లేవని.. ఫలితంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.