https://oktelugu.com/

Pawan vs Jagan : జగన్ ను ఇమిటేట్ చేసిన పవన్.. కామెడీకి జనం ఈలలు

కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలను ఇమిటేట్ చేసి కామెడీ చేశారు.

Written By: , Updated On : June 14, 2023 / 10:37 PM IST
Follow us on

Pawan vs Jagan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ప్రజల్లోకి వచ్చారు. ఈ యాత్రలో భాగంగా అన్నవరంలో వాహనానికి పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి కాకినాడ జిల్లా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభకు వెళ్లి అభిమానులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలను పవన్ కళ్యాణ్ గుప్పించారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా పలు అంశాలపై ఆయన మాట్లాడిన తీరును ఇమిటేట్ చేస్తూ పవన్ మాట్లాడిన మాటలు ఆసక్తిని కలిగించాయి.

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టించాయి. ఆయా పార్టీలు జోరుగా ప్రజల్లోకి వెళుతూ ప్రజా మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆయన తీవ్రత స్థాయిలో విమర్శలు చేశారు. కొన్ని అంశాలపై గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను అనుకరిస్తూ కత్తిపుడి సభలో పవన్ చేసిన ప్రసంగం అభిమానులను ఎంతగానో ఉత్సాహ పరిచింది.

జగన్మోహన్ రెడ్డి మాటలను ఇమిటేట్ చేసిన పవన్..

కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలను ఇమిటేట్ చేసి కామెడీ చేశారు. ఆడ పడుచుల కోసం తాను మద్యపానం నిషేధిస్తున్నానంటూ గట్టిగా చెప్పారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆయన ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ప్రజలకు నమ్మకం కలిగించేందుకు అరిచేవారని, అలా అరవాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను సిపిఎస్ రద్దు చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారని.. ఇలా గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆచరణలో చేసి చూపించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అలాగే, కరెంటు చార్జీలు తీసేస్తున్నా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తీసేశారని, పైగా ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని విమర్శించారు. మద్యం నుంచి ఆదాయం వద్దనుకున్న వ్యక్తి రూ.25 వేల కోట్లు ఆదాయాన్ని సంపాదించారని విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డిని అనుకరిస్తూ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు అభిమానులను ఆనందానికి గురి చేశాయి. ఏం జగన్మోహన్ రెడ్డిని అనుకరిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Pawan Kalyan Imitates CM Jagan in Janasena Public Meeting at Kathipudi
Recommended Video:
జన ప్రభంజనంతో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం || Pawan Kalyan's Varahi Yatra begins || Ok Telugu