Pawankalyan : పవన్ వ్యూహంలో మార్పునకు కారణమేంటి? ఇన్నాళ్లూ పదవులతో పనిలేదన్న ఆయన స్ట్రాటజీ మార్చారెందుకు? సెడెన్ గా సీఎం పదవి ఎందుకు కోరుతున్నట్టు? పనితీరు మారకుంటే రెండేళ్లలో రాజీనామా చేస్తానని ఎందుకు చెబుతున్నారు? పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఇదంతా తనను అభిమానించే వారి కోసమేనంటూ పవన్ చెబుతున్నారు. కానీ కారణం వేరే ఉందన్న చర్చ నడుస్తోంది. ఏపీలో మెజార్టీ ప్రజలు చంద్రబాబు, జగన్ పాలనను చూశారు. ఎత్తూపల్లాలు, తప్పొప్పులు, ఇలా అన్నిరకాలుగా పరిణామాలను ప్రజలు చవిచూశారు. అయితే పవన్ లో నిజాయితీ కనిపిస్తోంది. పార్టీ స్థాపించి సుదీర్ఘ కాలమవుతున్నా, సరైన విజయం దక్కకున్నా ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా భావిస్తున్నారు. వాటి కోసం అలుపెరగని కృషిచేస్తున్నారు.
ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మెజార్టీ ప్రజలకు మింగుడుపడడం లేదు. అలాగని ప్రత్నామ్నాయం లేదు. పవన్ రూపంలో ఉన్నా ఆయన గెలుపోటములను నిర్దేశించగలరే కానీ.. గెలుపు అందుకునే స్థితిలో లేరు. పైగా ఏదో ఒక పార్టీ నీడకు చేరక తప్పని పరిస్థితి. ముఖ్యంగా టీడీపీ అంటే గిట్టని వర్గాలు పవన్ గొడుగు కిందకు చేరుతున్నాయి. కానీ అదే పవన్ చంద్రబాబుతో వేదిక పంచుకోవడం వారికి ఇష్టం లేదు. ఇటీవల పవన్ చేసిన సర్వేలో అదే తెలింది. వైసీపీకి 18 శాతం గ్రాఫ్ తగ్గింది. ఇలా తగ్గిన వర్గాలు జనసేన వైపు చూస్తున్నారు. జనసేన మాత్రం టీడీపీ వైపు చూస్తోంది. అందుకే వారు పునరాలోచనలో పడినట్టు నేరుగా పవన్ కు నివేదికలందాయట.
పవన్ సెడన్ గా స్ట్రాటజీ మార్చడం వెనుక ఉన్నది ఏపీ జనమే. కానీ పవన్ మాత్రం తనను అభిమానించే వారి కోసమే సీఎం చాన్స్ అడిగినట్టు చెబుతున్నారు. అంటే వారు ఫ్యాన్స్ కాదు. ఒక సెక్షన్ ప్రజలనేని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అంటే ఇష్టం లేని చాలా వర్గాలు వైసీపీ వైపు టర్న్ అయ్యాయి. జగన్ అధికారంలోకి వస్తే తమకు న్యాయం చేస్తారని భావించాయి. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అదే వర్గాలు వంచనకు గురయ్యాయి. అలాగని టీడీపీ వైపు అవి చూడడం లేదు. పవన్ వైపు చూస్తున్నా.. ఆయన టీడీపీ వైపు వెళ్లాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టే పవన్ యూటర్న్ తీసుకున్నారు. పైకి మాత్రం తనను అభిమానించే వారి కోసమే సీఎం స్లోగన్ ఇచ్చానని చెబుతున్నా.. తెర వెనుక మాత్రం వైసీపీ నుంచి టర్న్ అయిన వారికి నమ్మకం కలిగించేందుకేనని విశ్లేషణలు వెలువడుతున్నాయి. సో అందులో ఎంత వాస్తవముందో చూడాలి మరీ.